News February 16, 2026

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

image

స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 140+ పాయింట్ల లాభంతో 82,768 వద్ద కదలాడుతోంది. అటు నిఫ్టీ సైతం 42 పాయింట్ల లాభంతో 25,515 వద్ద ఊగిసలాడుతోంది.

Similar News

News February 16, 2026

నైట్ షాపింగ్‌కు ముస్తాబవుతున్న హైదరాబాద్

image

మరో 3రోజుల్లో రంజాన్ మాసం ప్రారంభం కానుండటంతో పాతబస్తీలో సందడి మొదలైంది. ఈ నెల 19 నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యే అవకాశముండటంతో చార్మినార్ పరిసరాల్లో వ్యాపారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నెల రోజుల పాటు కొనసాగే నైట్ షాపింగ్‌తో పాటు, నోట్లో కరిగిపోయే హలీం రుచులను ఆస్వాదించేందుకు నగరవాసులు భారీగా తరలిరానున్నారు. దీంతో ఓల్డ్ సిటీ సరికొత్త వెలుగులతో కళకళలాడుతోంది.

News February 16, 2026

మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ

image

తనకు షోల్డర్ కీహోల్ సర్జరీ జరిగినట్లు మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. ఇది చిన్న సర్జరీ అని, వేగంగా కోలుకుంటున్నానని ట్వీట్ చేశారు. రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. అల్లు శిరీష్ పెళ్లి ఆహ్వాన పత్రిక అందుకుంటున్న సమయంలో తీసిన ఫొటోల్లో చిరంజీవి చేతికి కట్టుతో కనిపించారు. దీంతో ఆయన చేతికి ఏం జరిగిందోనని సినీ వర్గాలు, అభిమానులు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఆయన దీనిపై స్పష్టతనిచ్చారు.

News February 16, 2026

BRS సొంతం చేసుకున్న మున్సిపాలిటీలు (EC సైట్ ప్రకారం)

image

రాయికల్ (జగిత్యాల జిల్లా), ఆలంపూర్ (గద్వాల), అయిజ (గద్వాల), అమనగల్ (రంగారెడ్డి), అమరచింత (వనపర్తి), ఆసిఫాబాద్ (కొమురం భీం), తూప్రాన్ (మెదక్), మూడుచింతలపల్లి (మల్కాజ్‌గిరి), ఎల్లంపేట్ (మల్కాజ్‌గిరి), సిరిసిల్ల, గడ్డపోతారం (సంగారెడ్డి), గుమ్మడిదల (సంగారెడ్డి), ఇస్నాపూర్ (సంగారెడ్డి), జిన్నారం (సంగారెడ్డి), చేర్యాల (సిద్దిపేట), దుబ్బాక (సిద్దిపేట), గజ్వేల్ (సిద్దిపేట), తిరుమలగిరి (సూర్యాపేట).