News August 8, 2024

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై అధికారులతో సమీక్ష

image

ఏలూరు కలెక్టరేట్‌లో బుధవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణపై కలెక్టర్ వెట్రీ సెల్వి, ఎస్పీ కిషోర్ అధికారులతో సమీక్షించారు. దేశ భక్తిని పెంపొందించే విధంగా వేడుకలు నిర్వహించాలని సూచించారు. ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈనెల 15వ తేదీ ఉదయం 9గం నుంచి వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వేడుకల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలన్నారు.

Similar News

News February 17, 2026

పోలవరం తెలుగుదేశంలో అంతర్మథనం

image

పోలవరం టీడీపీలో అంతర్మథనం ప్రారంభం అయింది. ప్రస్తుతం బొరగం శ్రీనివాస్ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్నారు. కాగా ఇంఛార్జ్ మార్పు ఉంటుందంటూ ప్రచారం సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్, కొవ్వాసి జగదీశ్వరి పేర్లు ఇన్‌ఛార్జ్ రేసులో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. దీంతో క్యాడర్ అయోమయంలో ఉంది. మరోవైపు గత ఎన్నికల్లో జనసేన టికెట్ దక్కించుకోవడంతో ఈ సారి ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని TDP నేతలు యత్నిస్తున్నారు.

News February 16, 2026

సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి: SP

image

భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో SP అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి నేరుగా 15 అర్జీలను స్వీకరించారు. ఇందులో ప్రధానంగా కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, భూవివాదాలు, ఆన్‌లైన్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను SP ఆదేశించారు.

News February 16, 2026

నరసాపురం: గల్ఫ్ వెళ్లిన మహిళ మృతి.. కానిస్టేబుల్‌‌పై కేసు

image

గల్ఫ్ పంపించి ఒక మహిళ మృతికి కారణమైన ఇద్దరు వ్యక్తులపై ఆదివారం నరసాపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. చిట్టవరంకి చెందిన మురాల రాజమణి(48) డిసెంబర్ 4, 2025న గల్ఫ్‌లో మృతి చెందింది. రాజమణిని ఉండికి చెందిన భీమవరం ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అలుగు యేసేబు, బింకం విమలు గల్ఫ్ పంపారు. అక్కడ అనారోగ్యానికి గురైన తన తల్లికి వైద్య సదుపాయాలు కల్పించలేదని కుమార్తె ఉషా పోలీసులుకు ఫిర్యాదు చేసింది.