News August 15, 2025

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరు కానున్న బీర్ల ఐలయ్య

image

జనగామ జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారని జనగామ డీపీఆర్‌వో బండి పల్లవి తెలిపారు. ఉదయం 9:30 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ, 9:40 గంటలకు పోలీసుల గౌరవ వందనం, 9:50 గంటలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జిల్లా అభివృద్ధిపై ప్రసంగం‌ ఉంటుందని పేర్కొన్నారు.

Similar News

News August 15, 2025

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

జనగామలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. శుక్రవారం ఉదయం 9.30కి ధర్మకంచ మినీ స్టేడియంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య జాతీయ పతాకం ఆవిష్కరిస్తారన్నారు. గౌరవ వందనం, మార్చ్ పాస్ట్, సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా పురస్కారాలు, స్టాల్స్ పరిశీలనతో వేడుకలు నిర్వహించనున్నట్లు వివరించారు.

News August 15, 2025

ఖమ్మం: పాఠశాలల్లో ప్రతి నెల 4వ శనివారం బ్యాగ్‌లెస్ డే..!

image

ఖమ్మం కలెక్టరేట్‌లో గురువారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ పి.శ్రీజ సమక్షంలో విద్యాశాఖ అధికారులతో యూడీఐఎస్ఈ నమోదు, యూనిఫాంలు, పాఠ్యపుస్తకాల పంపిణీ, అపార్ రిజిస్ట్రేషన్, మధ్యాహ్న భోజనం, పాఠశాలల అభివృద్ధి వంటి అంశాలపై సమీక్షించారు. ఇకపై ప్రతి నెల 4వ శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో బ్యాగ్‌లెస్ డేగా నిర్వహించి, క్రీడలు, పాటలు, వంటి కార్యక్రమాలు ఏర్పాటు ఏర్పాటు చేయాలని ఆదేశించారు

News August 15, 2025

కామారెడ్డి: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

image

12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కల్లూరి మహేష్‌కు కామారెడ్డి జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.70 వేల జరిమానా విధించింది. బాన్సువాడలో 2021లో జరిగిన ఈ ఘటనపై బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం ఈ కేసుపై విచారణ జరిపిన జిల్లా జడ్జి వర ప్రసాద్, సాక్ష్యాలు, వైద్య నివేదికల ఆధారంగా నిందితుడు మహేష్‌ను దోషిగా నిర్ధారించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.