News August 15, 2025
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

జనగామలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. శుక్రవారం ఉదయం 9.30కి ధర్మకంచ మినీ స్టేడియంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య జాతీయ పతాకం ఆవిష్కరిస్తారన్నారు. గౌరవ వందనం, మార్చ్ పాస్ట్, సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా పురస్కారాలు, స్టాల్స్ పరిశీలనతో వేడుకలు నిర్వహించనున్నట్లు వివరించారు.
Similar News
News August 15, 2025
ఇవాళ టీవీలో వచ్చే దేశభక్తి సినిమాలు ఇవే

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టీవీ ఛానల్స్‌లో ఎన్నో మంచి దేశభక్తి చిత్రాలు ప్రసారం కానున్నాయి. *జెమినీ టీవీ: మ.2.30 గం.కు మేజర్ చంద్రకాంత్ *జెమిని లైఫ్: ఉ.11గం.కు అల్లూరి సీతారామరాజు *జెమిని మూవీస్: మ.1 గం.కు ఖడ్గం, సా.4 గం.కు మహాత్మ, రా.10 గం.కు మేజర్ *జీ తెలుగు: సా.4 గం.కు సుభాష్ చంద్రబోస్ *జీ సినిమాలు: ఉ.9 గం.కు ఉరీ ది సర్జికల్ స్ట్రైక్స్ *స్టార్ మా మూవీస్: సా.6 గం.కు అమరన్.
News August 15, 2025
EP36: శత్రువులను ఎలా గెలవాలంటే: చాణక్య నీతి

ప్రతి వ్యక్తికి మిత్రులే కాదు.. శత్రువులు కూడా ఉంటారు. అలాంటి విరోధిని ఎలా గెలవాలో చాణక్య నీతి వివరిస్తోంది. ‘మీ శత్రువు ముందు మీరు ఆనందంగా ఉండండి. మీ విజయాలను వారికి తెలిసేలా చేయండి. మీ సంతోషం, మీ ఎదుగుదలే ఆ శత్రువులను అథఃపాతాళానికి తొక్కేస్తుంది. ఇంతకన్నా మీరు వారిపై మరే ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు’ అని చెబుతోంది.
<<-se>>#Chankyaneeti<<>>
News August 15, 2025
తిరుపతి IITలో ఉద్యోగాలకు దరఖాస్తులు

ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IITలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నారు. అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఇతర వివరాలకు www.iittp.ac.in/Outsourced_Positions వెబ్‌సైట్ చూడాలి. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 25.