News November 17, 2025

స్విమ్మింగ్ పోటీల్లో బాపట్ల విద్యార్థికి గోల్డ్ మెడల్

image

ఏపీ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ పోటీల్లో బాపట్ల మండలం దగ్గుమళ్లి వారిపాలెం విద్యార్థి శ్రీయాన్ ఆనంద్ సత్తా చాటి గోల్డ్ మెడల్ సాధించినట్లు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ మురళి చెప్పారు. ఆదివారం విజయవాడలో నిర్వహించిన పోటీల్లో సబ్ జూనియర్స్ ఛాంపియన్‌షిప్-2025లో తొలి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడన్నారు. విజేతగా నిలిచిన విద్యార్థిని పలువురు అభినందించారు.

Similar News

News April 14, 2026

మునగాకుతో ఎన్నో లాభాలు

image

ఆయుర్వేదంలో మునగకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. NCBI నివేదిక ప్రకారం.. మునగ ఆకుల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్-ఎ, సి, బి కాంప్లెక్స్, బీటా-కెరోటిన్, అమైనో యాసిడ్స్‌, ఫినోలిక్‌లతో పాటు, 40 కంటే ఎక్కువ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇందులో ఉండే పీచు, జీర్ణవ్యవస్థతో పాటు పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది.

News April 14, 2026

VJA: అంబేద్కర్ స్మృతి వనంలో ఓపెన్ థియేటర్ మూత!

image

విజయవాడలోని అంబేడ్కర్ స్మృతి వనంలో ఓపెన్ థియేటర్ నిర్వహణ అటకెక్కింది. 90 మంది సామర్థ్యంతో నిర్మించిన ఈ థియేటర్ మరమ్మతుల సాకుతో మూతపడింది. మరోవైపు రూ.404 కోట్ల ప్రాజెక్టులో ఇప్పటివరకు రూ.320 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. రూ.90 కోట్లతో కళామందిరం సిద్ధమైనా, ఫుడ్ కోర్టు, చిల్డ్రన్ పార్క్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఈ ఓపెన్ థియేటర్ గురించి ప్రచారం చేయకపోవడంపై విమర్శలు వినిసిస్తున్నాయి.

News April 14, 2026

నెల్లూరు: వడదెబ్బతో వ్యక్తి మృతి

image

ఉదయగిరిలోని దాసరపల్లిలో వడదెబ్బ తగిలి షేక్. మౌలాలి (65) మృతి చెందాడు. పొలానికి నీళ్లు కట్టడానికి 10 గంటల సమయంలో వెళ్లిన మౌలాలి పొలం పనులు ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు. కొద్దిసేపటికి స్పృహ తప్పి పడిపోయాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యాధికారులు వెల్లడించారు.