News January 14, 2026

స్విమ్మింగ్ ఫూల్ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈత కొలను(స్విమ్మింగ్ పూల్) మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో క్రీడా సదుపాయాలపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. మరమ్మతులు ముగించి, నైపుణ్యం గల సిబ్బందిని నియమించాలని సూచించారు. ఈత కొలనును ఏడాది పొడవునా వినియోగంలో ఉండేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

Similar News

News January 24, 2026

మంచిర్యాల: కార్పొరేటర్ టికెట్ @రూ.50లక్షలు

image

కొత్తగా ఏర్పడిన MNCL కార్పొరేషన్‌లో కార్పొరేటర్ పదవి “కోట్ల”తో ముడిపడి ఉంది. రూ.50లక్షలు ఖర్చు చేయగలవారికే కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం. BJP, BRSలు సైతం ఇదే బాటలో నడుస్తున్నాయి. ఒక్కో డివిజన్‌లో 2500 -3500 ఓటర్లు ఉండగా ఓటుకు రూ.1000 పంపిణీ తప్పదని అభ్యర్థులు బేరీజు వేస్తున్నారు. 60 డివిజన్లలో కలిపి ఒక్కో పార్టీ సుమారు రూ.35 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు వ్యూహరచన చేస్తోంది.

News January 24, 2026

సిద్దిపేట: చేనేత కార్మికులకు రుణ మాఫీ విడుదల

image

రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తూ నిధులు విడుదల చేసింది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు కార్మికులు తీసుకున్న బ్యాంకు రుణాలను మాఫీ చేసినట్లు జౌళి శాఖ సంచాలకులు సాగర్ తెలిపారు. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లాలో 7 మంది కార్మికులకు సంబంధించి రూ. 5 లక్షల నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News January 24, 2026

కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ

image

TG: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌తో కేటీఆర్ సమావేశం అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న విచారణకు హాజరైన విషయాలను గులాబీ బాస్‌కు వివరిస్తున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో హరీశ్ రావు కూడా ఫామ్‌హౌస్‌కు చేరుకోనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై కేటీఆర్, హరీశ్‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.