News April 4, 2025

స్విమ్స్‌కు జాతీయ ప్రాముఖ్యత హోదా ఇవ్వండి: ఎంపీ

image

రాయలసీమ ప్రజలకు ఎనలేని సేవలందిస్తున్న తిరుపతి స్విమ్స్‌కు జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా పరిగణించాలని ఎంపీ గురుమూర్తి కోరారు. తద్వారా కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు మంజూరు చేసే అవకాశం వస్తుందన్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాల అభివృద్ధి, నూతన పరిశోధన ప్రయోగశాలలు, వైద్య పరికరాలకు నిధులు వస్తాయన్నారు.

Similar News

News November 10, 2025

యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

నరసన్నపేట మండలం కోమార్తి జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ కారు మరమ్మతులకు గురికావడంతో పెద్దపాడు నుంచి మెకానిక్ కోరాడ వెంకటేశ్ వచ్చి మరమ్మతులు చేస్తున్నాడు. ఆ సమయంలో వెనక నుంచి వస్తున్న కారు ఆగి ఉన్న కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో వెంకటేశ్ మృతిచెందగా కారులో ఉన్న సంతోశ్, సుశీల, శ్యాముల్ గాయపడ్డారు.

News November 10, 2025

SRPT: ‘ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి’

image

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కె.సీతారామారావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి 44 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి, తేమ శాతం 17 రాగానే కాంటా వేయాలని సూచించారు. ప్రతి దరఖాస్తు స్టేటస్‌ను లబ్ధిదారులకు తెలియజేయాలని ఆదేశించారు.

News November 10, 2025

విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సీఎం సమీక్ష

image

విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ రాష్ట్రానికి గ్రోత్ హబ్‌గా తీర్చిదిద్దే అంశంపై చర్చించారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకూ జిల్లాలను విశాఖ ఎకనామిక్ రీజియన్‌గా అభివృద్ధి చేసే అంశంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులు, జీవన ప్రమాణాలు, తదితర అంశాలతో ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై చర్చించారు.