News March 8, 2025
స్విమ్స్‌లో ఖాళీ పోస్టులకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు

తిరుపతి స్విమ్స్‌లో వివిధ క్యాటగిరీల్లో సీనియర్ రెసిడెన్స్ వైద్యుల వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు రిజిస్టర్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్ల తెలిపారు. 20 విభాగాల్లో 38 పోస్టులకు ఈనెల 14వ తేదీ ఉదయం 10.30 గంటలకు పాత డైరెక్టర్ కార్యాలయం కమిటీ హాలులో జరుగుతాయన్నారు. మరిన్ని వివరాలకు https://svimstpt.ap.nic.inను సంప్రదించాలని కోరారు.
Similar News
News March 2, 2026
ఇవాళ తెలంగాణకు రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ TGలో పర్యటించనున్నారు. ఉ.9.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. వికారాబాద్(D) అనంతగిరిలో జరుగుతున్న DCC అధ్యక్షుల శిక్షణా కార్యక్రమానికి హాజరై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు చేయనున్నారు. AP, TG కాంగ్రెస్ ముఖ్య నేతలతోనూ భేటీ కానున్నారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులనూ రాహుల్ కలిసే అవకాశం ఉంది.
News March 2, 2026
ఈనెల 15లోగా పరిహారం అందిస్తాం: మంత్రి పొంగులేటి

TG: వెలుగుమట్ల <<19243377>>భూవివాదాన్ని<<>> ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మానుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ హెచ్చరించారు. అర్హులైన పేదలకు ఈనెల 15లోపు ఇళ్ల స్థలాలతో పాటు ₹5లక్షల పరిహారం ఇప్పిస్తానని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో అధికారుల తప్పు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా అక్రమ గృహాల తొలగింపుతో ₹250 కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
News March 2, 2026
ఒక్క ఇన్నింగ్స్‌తో రోహిత్, కోహ్లీ రికార్డులు బ్రేక్!

విండీస్‌తో మ్యాచ్‌లో సంజూ శాంసన్ రికార్డులు బద్దలు కొట్టారు. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు (16) బాదిన భారత ప్లేయర్‌గా రోహిత్ శర్మ (15) రికార్డ్ బ్రేక్ చేశారు. అలాగే ఛేజింగ్‌లో అత్యధిక రన్స్ (97*) స్కోర్ చేసి విరాట్ కోహ్లీ (82*) రికార్డ్ అధిగమించారు. కోహ్లీ 2016లో AUSపై, 2022లో PAKపై ఈ రన్స్ చేశారు. T20Iల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు (3) దక్కిన ఇండియన్ కీపర్ కూడా సంజూనే.


