News July 8, 2024
స్విమ్స్‌లో డిగ్రీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల

తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) యూనివర్సిటీ డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జులై 22వ తేదీ లోగా దరఖాస్తులను సమర్పించాలని కోరింది.
Similar News
News February 8, 2026
చిత్తూరు: వృద్ధురాలి దారుణ హత్య

గుడిపల్లి (M) ON కొత్తూరు సమీపంలోని ఇటుకల బట్టీ వద్ద ఆదివారం చిన్నక్క (70) ఆనే వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె గొంతుతో పాటు చెవులను సైతం కోసి దారుణంగా హత్య చేశారు. ఇటుకల బట్టీలో వృద్ధురాలి మృతదేహం పడి ఉండడాన్ని ఇటుకల కోసం వచ్చిన వారు చూసి స్థానికులకు సమాచారం అందించారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 8, 2026
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రేపు PGRS కార్యక్రమం

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజల ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం వెల్లడించింది. సోమవారం ఉ.10.30 గంటలకు పాత డీపీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను జిల్లాస్థాయి పోలీస్ అధికారులకు నేరుగా తెలియజేసి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది.
News February 8, 2026
ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

చిత్తూరు జిల్లాలోని ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాపై (బర్డ్ ఫ్లూ) పౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. ఈ సందర్భంగా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పౌల్ట్రీ పక్షుల్లో అధిక సంఖ్యలో మరణాలు సంభవించినట్లయితే వెంటనే పశుసంవర్ధక శాఖకు, జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా పక్షి నుంచి పక్షికి మాత్రమే వ్యాపిస్తుందన్నారు.


