News July 30, 2024

స్వీడన్ బ్యాచ్ ప్రోగ్రాం కోర్సుకు 13 అడ్మిషన్లు

image

అనంతపురం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన స్వీడన్ బ్యాచ్ ప్రోగ్రాం కోర్సుకు 13మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. దీనికి సంబంధించి మొత్తం 4సంవత్సరాల బీటెక్ కోర్సుకు గాను.. 3 సంవత్సరాలు జేఎన్టీయూ క్యాంపస్‌లో చదివిన అనంతరం మిగిలిన 1 సంవత్సరం స్వీడన్‌లో చదువుతారు. ఈ మేరకు జేఎన్టీయూ రిజిస్ట్రార్ ఎస్.కృష్ణయ్య విద్యార్థులకు తమ అడ్మిషన్ పత్రాలను అందజేశారు.

Similar News

News February 16, 2026

ఏపీఎంఐపీ ఆటోమేషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

రైతులు ఏపీఎంఐపీ ఆటోమేషన్ పథకాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సూచించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పథక పోస్టర్లను ఆవిష్కరించారు. సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థల ఆటోమేషన్‌కు హెక్టారుకు రూ.40,000 సూచిక వ్యయంపై సబ్సిడీ అందుతుందని తెలిపారు. నీటి వృథా తగ్గించి, అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. రైతు సేవా కేంద్రం లేదా ఉద్యానవన కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News February 16, 2026

బిల్‌ గేట్స్‌ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న కలెక్టర్

image

అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రులు, కార్యదర్శులతో కలిసి బిల్‌ గేట్స్‌ బృందంతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అనంతపురం కలెక్టరేట్‌ ఎన్ఐసీ భవనం నుంచి జిల్లా కలెక్టర్‌ ఆనంద్, జాయింట్ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ వర్చువల్ విధానంలో ఈ భేటీకి హాజరయ్యారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. పాలనలో సాంకేతికతను జోడించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు ఈ సమావేశం దిశానిర్దేశం చేసింది.

News February 16, 2026

కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: కలెక్టర్

image

రేపు జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని జిల్లాలో సజావుగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమ నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు.