News December 10, 2025
స్వేచ్ఛాయుత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు: కలెక్టర్

వనపర్తి జిల్లాలోని ఐదు మండలాల్లో రేపు(గురువారం) నిర్వహించనున్న మొదటి విడత పోలింగ్ స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఓటర్లు తమ అమూల్యమైన ఓటును ఎలాంటి ప్రలోభాలకు తలోగ్గకుండా, భయభ్రాంతులకు గురికాకుండా వినియోగించుకోవాలన్నారు. తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
Similar News
News December 10, 2025
BREAKING: యర్రగుంట్లలో ఇద్దరు యువకుల మృతి

యర్రగుంట్లలోని ముద్దునూరు రోడ్డులో ఉన్న జడ్పీ బాయ్స్ హైస్కూల్ సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. సింహాద్రిపురం నుంచి ప్రొద్దుటూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ముద్దనూరు వైపు వెళ్తున్న బైకు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే చనిపోయారు. సీఐ విశ్వనాథ్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
News December 10, 2025
ఈనెల 11న వేతనంతో కూడిన సెలవు: NGKL కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11న వేతనంతో కూడిన సెలవును ప్రభుత్వం ప్రకటించిందని కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. మొదటి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ప్రభుత్వయేతర సంస్థలు, పరిశ్రమలలో పనిచేసే సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు ఉన్నట్లు వెల్లడించారు.
News December 10, 2025
NGKL: ’18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపవచ్చు’

మొదటి విడత జిల్లాలో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలలో ఓటు వేయడానికి 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ బధావత్ సంతోష్ పేర్కొన్నారు. ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబు కార్డు, ఫొటోతో కూడిన బ్యాంక్ పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కార్డు, పాన్ కార్డు తదితర గుర్తింపు కార్డులు చూపించి ఓటు వేయాలని కోరారు.


