News October 7, 2025

స.హ చట్టంపై అవగాహన ఉండాలి: మహేందర్ జీ

image

సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ మహేందర్ జీ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో సమాచార హక్కు చట్ట వారోత్సవాల్లో భాగంగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఈనెల 5వ తేదీ నుంచి సమాచార హక్కు చట్ట వారోత్సవాల్లో మొదలయ్యాయన్నారు. ఈ నెల 12వ తేదీ వరకు అధికారులు సమాచార హక్కు వారోత్సవాలను జిల్లాలోని డివిజన్, మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలన్నారు.

Similar News

News October 7, 2025

సంగారెడ్డి జిల్లాలో భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో భూ సేకరణ వేగవంతం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ కింద భూసేకరణ వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతులకు పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

News October 7, 2025

MBNR: తెలుగు వర్శిటీ.. ఫలితాలు విడుదల

image

తెలుగు వర్శిటీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులకు వివిధ అంశాలలో వార్షిక పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు తెలుగు వర్శిటీ అధికారులు Way2Newsతో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను.. తెలుగు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 14 ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలలు, కళాశాలల్లో జూన్ 2025లో పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను www.teluguuniversity.ac.in వెబ్ సైట్‌లో సందర్శించాలన్నారు.

News October 7, 2025

జూబ్లీహిల్స్: కాంగ్రెస్ పార్టీకి ద్వితీయ విజయం దక్కేనా!

image

జూబ్లీహిల్స్‌లో రెండో విజయం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. 2009లో నియోజకవర్గం ఏర్పడిన మొదటిసారే అక్కడ పాగా వేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి PJR కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పట్టు నిలుపుకోలేకపోయింది. నియోజకవర్గంలో ఐదోసారి జరిగే ఈ ఎన్నికల్లో ద్వితీయ విజయం దక్కించుకుంటుందో.. లేదో చూడాలి.