News August 21, 2025
హజ్ యాత్రకు HYD నుంచి 2,210 మంది ఎంపిక

హజ్ యాత్రకు నగరం నుంచి 2,210 మంది ఎంపికయ్యారని రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ సయ్యద్ ఆఫ్జల్ బియబానీ ఖుస్రో పాషా తెలిపారు. తెలంగాణ నుంచి మొత్తం 4,292 మందిని డ్రా పద్ధతిలో ఎంపిక చేశామన్నారు. 11,757 మంది అప్లై చేసుకోగా వీరిని డ్రా పద్ధతిలో ఎంపిక చేశామన్నారు. మరింత సమాచారం కోసం హజ్ కమిటీ కార్యాలయంలో సంప్రదించాలని ఈ సందర్భంగా సూచించారు.
Similar News
News August 21, 2025
HYD: ఏ రైల్వే స్టేషన్‌కు వెళ్లాలో చూసుకోండి జర

రైల్వే ప్రయాణికులు రైల్వే స్టేషన్‌కు వెళ్లేటపుడు ఏ స్టేషనుకు వెళ్లాలో చూసుకొని వెళ్లాలి. ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి పలు రైళ్లు ఇతర స్టేషన్ల నుంచి బయలుదేరుతున్నాయి. అక్టోబర్ 20 నుంచి వారం రోజుల పాటు ఈ మార్పులుంటాయి. పోర్బందర్ ట్రైన్ ఉందానగర్ నుంచి, సిద్దిపేట బండి మల్కాజిగిరి నుంచి, పుణె ఎక్స్‌ప్రెస్ నాంపల్లి నుంచి నడుస్తాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
News August 21, 2025
HYD: ఒక్క పిల్లర్ నిర్మాణం వెనక నెలల కష్టం

ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది. ఒక్క పిల్లర్ నిర్మాణం వెనుక నెలల కష్టం ఉంటుందని ఇంజినీర్లు తెలిపారు. పిల్లర్ల నిర్మాణం ఇన్ సిట్యూ పద్ధతిలో అక్కడే జరుగుతుంది. పిల్లర్ల నిర్మాణంలో ఫౌండేషన్ ఒకేత్తయితే, పైభాగం(వెబ్) నిర్మాణం మరో ఎత్తు. పిల్లర్‌పై భాగం నిర్మాణానికి భారీ స్థాయిలో స్టీల్ అవసరం ఉంటుందని AE అనిల్ తెలిపారు.
News August 21, 2025
అత్యధికంగా సిమెంట్ వినియోగం HYDలోనే

HYD, రంగారెడ్డి శివారులో అనేక చోట్ల రెడీమిక్స్ ప్లాంట్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా HYDలోనే అత్యధిక సిమెంట్ వాడుతున్నట్లు సివిల్ ఇంజినీరింగ్ టెక్నికల్ యంత్రాంగం గుర్తించింది. అయితే.. థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా విడుదలవుతున్న ఫ్లైయాష్‌ను సిమెంట్ పరిశ్రమలు తక్కువగా వినియోగిస్తున్నట్లు కేంద్ర పర్యావరణశాఖ, అటవీశాఖ సహాయక మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ వెల్డించారు.