News January 25, 2025
హత్యకు గురైన ఈరన్నకు వైసీపీ నేతల నివాళి
ఆలూరు మండలం అరికెర గ్రామంలో శుక్రవారం ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇవాళ కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గ్రామంలో ఈరన్న భౌతికకాయానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
Similar News
News January 27, 2025
ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా సురేంద్ర
విశాఖపట్నంలో జరుగుతున్న ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పత్తికొండకు చెందిన సురేంద్ర బాబును రాష్ట్ర శాఖ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తానన్నారు. ఈ అవకాశం కల్పించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
News January 26, 2025
కానిస్టేబుల్ అభ్యర్థులకు కర్నూలు జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ శుభవార్త
కానిస్టేబుల్ అభ్యర్థులకు కర్నూలు జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా శుభవార్త చెప్పారు. కానిస్టేబుల్ ఈవెంట్స్‌కు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు గైర్హాజరైన అభ్యర్థులు ఈనెల 27న హాజరుకావాలని పిలుపునిచ్చారు. నిబంధనల ప్రకారం అభ్యర్థులు ఒరిజినల్, జిరాక్స్ ధ్రువపత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. 28వ తేదీతో అభ్యర్థుల దేహదారుడ్య పరీక్షలు ముగుస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
News January 26, 2025
కర్నూలు: ‘ఆ హత్య దారుణం’
ఆలూరు మండలం అరికెర గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ హత్య అత్యంత అమానుషమైన చర్య అని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బీ.వీరశేఖర్ అన్నారు. దేవనకొండలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ఫ్యాక్షన్ నుంచి సామాన్య ప్రజానీకం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, ఇలా హత్యలు చేయడం తగదని అన్నారు.