News March 1, 2025

హత్యాయత్నం కేసులో నిందితుడికి 2 ఏళ్లు జైలు: పార్వతీపురం SP

image

హత్యాయత్నం కేసులో నిందితునికి రేండుళ్లు జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం సీనియర్ సివిల్ జడ్జి తీర్పును వెలువరించినట్లు ఎస్పీ ఎస్.వి మాధవ్ రెడ్డి తెలిపారు. 2022 మే 19 న పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామంలో జరిగిన గొడవలో బి.రాము తన భార్యపై అనుమానంతో అదే గ్రామానికి చెందిన ప్రభాకర్‌తో గొడవపడి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నేరం రుజువు కావడంతో జైలు శిక్షతోపాటు రూ. 500 జరిమానా కోర్టు విధించింది.

Similar News

News March 1, 2025

కోదాడ‌: కలకలం రేపుతున్న మైనర్ మిస్సింగ్

image

కోదాడ‌లో బాలిక అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. వివరాలిలా.. మేళ్లచెర్వు మండలానికి చెందిన బాలికకు కోదాడకు చెందిన పదో తరగతి అబ్బాయి స్నాప్‌చాట్‌లో పరిచయమయ్యాడు. ఈ క్రమంలో బాలిక అతడిని కలవడానికి ఇంట్లో బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి కోదాడకు వెళ్లింది. ఆరు రోజులైనా తిరిగి రాకపోవడంతో బాలుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా బాలుడిని విచారిస్తున్నట్లు తెలిపారు. 

News March 1, 2025

పెత్తనం చేసే మహిళా సర్పంచ్ భర్తలకు ఫైన్!

image

చాలా గ్రామాల్లో పేరుకే మహిళా సర్పంచ్ ఉంటారు. ఆమె భర్తే పెత్తనం చేస్తుంటారు. ఇలా మహిళా సాధికారతను దెబ్బతీస్తున్న వారికి జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసింది. ఎన్నికైన మహిళా సర్పంచులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, పాలనలో వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఓ వ్యవస్థ తీసుకురావాలని కమిటీ సూచించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖకు నివేదిక సమర్పించింది.

News March 1, 2025

కృష్ణా: నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్

image

కొత్త వాహన చట్టాన్ని మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చేందుకు కృష్ణా జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. ఇకపై హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ.1000, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే రూ.5వేలు, మద్యం తాగి, సెల్‌ఫోన్ పట్టుకుని వాహనం నడిపితే రూ.10వేలు, నంబర్ ప్లేట్ సరిగ్గా లేకుంటే రూ.2వేల జరిమానా విధించనున్నారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించి సహకరించాలని అధికారులు కోరారు.

error: Content is protected !!