News September 13, 2024

హత్యాయత్నం కేసులో 18 ఏళ్లు జైలు శిక్ష

image

కాకినాడలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ చిన్నారావుపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ముద్దాయి దుర్గాప్రసాద్ కు 18 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ కాకినాడ రెండవ అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ విజయబాబు గురువారం తీర్పు చెప్పారు. 2023 మార్చి 17వ తేదీన హత్యాయత్నానికి పాల్పడ్డా ఘటనలో అప్పట్లో కేసు నమోదు చేశారు. కేసులో నేరం రుజువు కావడంతో జడ్జ్ శిక్ష విధించారని సీఐ అప్పలనాయుడు తెలిపారు.

Similar News

News August 21, 2025

రాజమండ్రి: ఎక్కడా ఇసుక కొరత లేదు: కలెక్టర్

image

తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక కొరత ఎక్కడా లేదని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. వర్షాలు, గోదావరి వరదల కారణంగా ఎక్కడ ఇసుక కొరత లేకుండా స్టాక్ పాయింట్ల వద్ద సరిపడా ఇసుకను అందుబాటులో ఉంచామన్నారు. ఇసుక కోసం ప్రజలు, కాంట్రాక్టర్లు, గృహ నిర్మాణాలు చేపట్టే వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.

News August 21, 2025

ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్ల ఎత్తివేత

image

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గురువారం సాయంత్రానికి నీటిమట్టం 12.90 అడుగులకు చేరడంతో జల వనరుల శాఖ అధికారులు బ్యారేజీలోని 175 గేట్లను ఎత్తి, 11.51 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వస్తుండటంతో గోదావరి వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉంది.

News August 21, 2025

తూ.గో: నిర్మానుష్య ప్రదేశాలలో డ్రోన్ నిఘా

image

జిల్లాలో బహిరంగ మద్యం, గంజాయి, డ్రగ్స్ వినియోగం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.నరసింహ కిషోర్ గురువారం తెలిపారు. పోలీస్ స్టేషన్ల పరిధిలోని బహిరంగ ప్రదేశాలు, గోదావరి నది పరివాహక ప్రాంతాలు, పాడుబడిన ఇళ్లు, తోటలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంటుందని ఆయన చెప్పారు.