News July 5, 2025

హత్యాయత్నం కేసు.. నిందితులకు 5 ఏళ్ల కఠిన కారాగారం

image

పెగడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్యాయత్నం కేసులో జగిత్యాల అసిస్టెంట్ సెషన్స్ న్యాయమూర్తి వెంకటమల్లిక్ నిందితులైన తోట నారాయణ (32), తోట మారుతి (35), ఆయన భార్య తోట జ్యోతికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.1500/- చొప్పున జరిమానా విధించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. నేరస్థులు చట్టం నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

Similar News

News July 5, 2025

పవన్ రాకతో.. జిల్లా జనసేన ఆల్ సెట్.!

image

ప్రకాశం జిల్లాలో జనసేన సెట్ అయినట్లేనన్న టాక్ నడుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ రాకతో జనసేన బలోపేతంపై క్యాడర్ దృష్టిసారించనున్నట్లు ప్రచారం సాగుతోంది. విభేదాలు వీడి ఒకే తాటిపైకి రావాలని మార్కాపురం పర్యటన సందర్భంగా వన్ నాయకులకు సూచించినట్లు సమాచారం. దీనితో జిల్లాలో క్యాడర్ ఒకే తాటిపైకి వచ్చి పార్టీపై దృష్టి సారించే పరిస్థితి ఉందట. చివరికి పవన్.. జిల్లాలో ఆల్ సెట్ చేసినట్లేనని టాక్ వినిపిస్తోంది.

News July 5, 2025

రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు

image

TG: ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో భాగంగా రేపటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం కానుంది. 175 కాలేజీల్లో 1.18 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో బీటెక్ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నా, తొలి విడత కౌన్సెలింగ్‌లో పెరిగిన సీట్లు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈ నెల 26, 27 తేదీల్లో రెండో విడత కౌన్సెలింగ్ జరగనుండగా, అప్పటిలోగా పెరిగిన సీట్లు అందుబాటులోకి వస్తాయని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి.

News July 5, 2025

రాజకీయాలు కాదు రైతుల శ్రేయస్సు ముఖ్యం: మంత్రి తుమ్మల

image

యూరియా విషయంలో ఎలాంటి రాజకీయం లేదని, రైతుల శ్రేయస్సే ముఖ్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టం చేశారు. ఈ విషయంపై రాజకీయాలు వద్దని.. రాష్ట్రానికి వాటాగా రావాల్సిన 1.94 లక్షల టన్నుల యూరియాను తెప్పించేలా బీజేపీ నేతలు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ప్రస్తుత వానాకాలం (ఖరీఫ్) సీజన్ కోసమే యూరియా అడిగిందని, గత యాసంగి (రబీ) సీజన్‌కు సంబంధించింది కాదని స్పష్టం చేశారు.