News April 14, 2025
హత్య కేసులో నిందితులు పోలవరం వాసులు

కొవ్వూరు (M) దొమ్మేరు పుంతలో జరిగిన హత్య కేసులో నిందితుడు పోలవరం (M) పాత పట్టిసీమకు చెందిన శ్రీనివాస్‌గా పోలీసులు వెల్లడించారు. హత్యకు గురైన పెండ్యాల ప్రభాకర్‌రావు వద్ద శ్రీనివాస్ 2024లో రూ.2.4లక్షల అప్పు తీసుకున్నాడు. ప్రభాకర్ డబ్బులు అడగడంతో విలాసాలకు అలవాటు పడ్డ శ్రీనివాస్ పోలవరానికి చెందిన ప్రవీణ్‌తో కలిసి హత్య చేశారు. కుడి చేతికున్న బంగారం కోసం చేతి మణికట్టును కూడా నరికేశారు.
Similar News
News September 16, 2025
పరిటాల శ్రీరామ్‌కు 2+2 భద్రత

ధర్మవరం నియోజకవర్గ టీడీపీ సమయన్వయకర్త పరిటాల శ్రీరామ్‌కు భద్రత పెరగనుంది. 2+2 భద్రత కల్పించాలని ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైసీపీ హయాంలో తన భద్రతను 1+1కు తగ్గించారని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శ్రీరామ్ తరఫున లాయర్ గోళ్ల శేషాద్రి వాదనలు వినిపించగా కోర్టు ఏకీభవించింది. భద్రత పెంచాలని తీర్పు వెలువరించింది.
News September 16, 2025
ఏడేళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుడుకి 20 ఏళ్ల శిక్ష: ఎస్పీ

పెద్ద శంకరంపేట మండలంలో ఏడేళ్ల బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడు మోహన్‌కు 20 ఏళ్ల శిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి నీలిమ తీర్పునిచ్చినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. బాలికకు పరిహారంగా రూ. 3 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. ఈ కేసులో శిక్ష పడేందుకు కృషి చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
News September 16, 2025
ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

TG: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్(TANHA) ప్రకటించింది. 323 ఆసుపత్రులకు ₹1,400 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని చెప్పింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామంది. మరోవైపు ఇటీవల ఇచ్చిన హామీ మేరకు ₹100 కోట్లు విడుదల చేశామని వైద్య వర్గాలు తెలిపాయి.