News January 26, 2025
‘హథిరాంజీ మఠం కూల్చివేతను అడ్డుకుంటాం’

ప్రాణాలను అడ్డుగా పెట్టి తిరుపతి గాంధీ రోడ్డులోని హథీరాంజీ మఠాన్ని కాపాడుకుంటామని టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి అన్నారు. తిరుపతిలోని మఠాన్ని శనివారం సాయంత్రం టీడీపీ నాయకులు పరిశీలించారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాలు కోసం పురాతనమైన మఠాన్ని కూల్చివేయాలని నిర్ణయించడం దారుణమన్నారు. మఠం భవనాల కూల్చివేతతో రూ.కోట్ల నష్టం వస్తుందని చెప్పారు.
Similar News
News December 26, 2025
శ్రీకాకుళం: పెరిగిన కోడి గుడ్డు ధర ఎంతంటే !

ఎన్నడూ లేని విధంగా కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. రూ.8 ఉన్న గుడ్డు ధర రూ.10కి చేరింది. హోల్సేల్ మార్కెట్లోనే ఒక్కో గుడ్డు రూ.9.30 పలుకుతోంది. ప్రస్తుతం ఒక ట్రే రూ.270 నుంచి రూ.290కి చేరింది. క్రిస్మస్, న్యూఇయర్ కారణంగా ఎగుమతులు పెరగటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ఎన్నడూ లేని విధంగా గుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వినియోగదారులు ఆందోళన పడుతున్నారు.
News December 26, 2025
ఖానాపూర్: కమిషనర్ బాధ్యతలు చేపట్టిన చంద్రకళ

ఆత్మకూరు మండలం ఖానాపురంకి చెందిన చంద్రకళ శంషాబాద్ జోనల్ కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ విషయంపై ఖానాపురం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆమె పని చేసిన ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించి అందరి ప్రశంసలు పొందారని గుర్తు చేసుకున్నారు. తమ గ్రామ బిడ్డ ఉన్నత పదవిని చేపట్టడం గర్వకారణమన్నారు. పలువురు గ్రామ భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
News December 26, 2025
రైతు భరోసా పథకం రద్దు.. క్లారిటీ

TGలో రైతు భరోసా పథకాన్ని నిలిపివేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వానికి చెందిన ‘తెలంగాణ ఫ్యాక్ట్ చెక్’ ఖండించింది. అలాంటి వార్తలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనవని తేల్చిచెప్పింది. ప్రస్తుతం లబ్ధిదారులకు మాత్రమే సాయం అందేలా గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 65లక్షల మందికి పైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని, సర్కార్ ఎలాంటి షరతులు విధించలేదని స్పష్టం చేసింది.


