News December 23, 2025
హనుమంతుడికి 5 ముఖాలు ఎలా వచ్చాయి?

రామరావణ యుద్ధంలో మైరావణుడు రామలక్ష్మణులను అపహరించి పాతాళంలో బంధిస్తాడు. అతడిని అంతం చేయాలంటే 5 దీపాలు ఒకేసారి ఆర్పాలి. అందుకే హనుమాన్ పంచముఖ రూపం ధరించి, ఆ దీపాలను ఆర్పి మైరావణుడిని వధించాడు. దుష్టశిక్షణ కోసం ఉద్భవించిన ఈ మహోగ్ర రూపం భక్తులకు సర్వ శుభాలను చేకూరుస్తుందని నమ్మకం. పంచముఖ హనుమత్ స్తోత్రం, పూజా విధానం, ఆయనను పూజిస్తే దోషాలెలా తొలగిపోతాయో తెలుసుకోవడం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
Similar News
News December 23, 2025
జుట్టు ఆరోగ్యం కోసం ఏం తినాలంటే?

జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే దాన్ని సంరక్షించడంతో పాటు పోషకాహారం తీసుకోవడం కూడా ముఖ్యం. దీనికోసం బాదం, చిలగడదుంప, గుడ్డు, శనగలు, పాలకూర తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిల్లో ఉండే బయోటిన్, ఐరన్, ఫోలేట్, విటమిన్ C ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచి జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్ సరఫరా చేస్తాయి. జుట్టు రాలిపోతున్నా, పలచగా ఉన్నా ఈ ఫుడ్స్ ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
News December 23, 2025
APPLY NOW: NIT గోవాలో పోస్టులు

<
News December 23, 2025
అంటే.. ఏంటి?: Stanza

పద్యం/ గేయం/పాట ఇలా రచనల్లో కొన్ని లైన్ల సమూహం Stanza. 10-15 లైన్ల గేయంలో కొన్ని లైన్లను ప్రస్తావిస్తే ఆ మొత్తమే ఇది. సాధారణంగా 4 లైన్లు ఉండే పద్యం/poemలా దీనికి పరిమితి లేదు. Stanza పదాన్ని ఇటాలియన్ నుంచి తీసుకోగా.. అర్థం: నిలబడిన స్థలం.
Ex: Vandemataram’s first two stanzas are officially recognized as India’s National Song
-రోజూ 12pmకు ఓ కొత్త పదం, అర్థం, పుట్టుక తెలుసుకుందాం
<<-se>>#AnteEnti<<>>


