News December 21, 2025
హనుమంతుడి కన్నా గొప్ప దౌత్యవేత్త ఎవరు?: జైశంకర్

శ్రీకృష్ణుడు, హనుమంతుడు గొప్ప దౌత్యవేత్తలని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ‘సీత సమాచారం కోసం హనుమ శ్రీలంకకు వెళ్లాడు. సమాచారం తెలుసుకుని, సీతమ్మను కలిసి మనోధైర్యం నింపాడు. రావణుడిని మానసికంగా ఓడించగలిగాడు. ఇంతకన్నా గొప్ప దౌత్యవేత్త ఎవరు? ఒక పని చెబితే 10 పనులు పూర్తిచేశాడు. అలాంటి వ్యక్తి గురించి ప్రపంచానికి తెలియజేయకపోతే మన సంస్కృతికి అన్యాయం చేసినట్లే’ అని పుణే బుక్ ఫెస్టివల్‌లో అన్నారు.
Similar News
News December 29, 2025
ఆ ఎమ్మెల్యేలకు డోర్స్ క్లోజ్: కేటీఆర్

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాకుండా తమ పార్టీ తలుపులు మూసుకున్నాయని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తామని చిట్ చాట్‌లో తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తాము ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేని గతి పట్టిందని దుయ్యబట్టారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తగిలిందని, ఆ భయంతోనే మున్సిపల్ ఎన్నికలు పెట్టట్లేదని ఎద్దేవా చేశారు.
News December 29, 2025
వెండి మరో రికార్డ్.. రెండో అత్యంత విలువైన అసెట్

కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్న వెండి ధరలు మరో రికార్డ్ నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు వెండి ధర 84 డాలర్లకు చేరింది. దీంతో $4.65 ట్రిలియన్ల వాల్యూతో ప్రపంచంలోనే రెండో అత్యంత విలువైన అసెట్(గోల్డ్ తర్వాత)గా నిలిచింది. ప్రముఖ టెక్ సంస్థ ఎన్విడియాను ($4.63 ట్రిలియన్లు) కూడా వెండి వెనక్కి నెట్టడం విశేషం. భౌగోళిక ఉద్రిక్తతలు, డాలర్ విలువ తగ్గటంతో వెండికి ఈ మధ్య డిమాండ్ పెరిగింది.
News December 29, 2025
రేపు తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు తిరుమలకు వెళ్లనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. కాగా ఈ అర్ధరాత్రి నుంచి తిరుమలలో ఉత్తరద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. లక్షలాది మంది భక్తులు రానుండటంతో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.


