News November 10, 2025
హనుమకొండ: అగ్నివీర్ ఎంపిక రెండో షెడ్యూల్ వివరాలు

హనుమకొండలో జరిగే ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో భాగంగా ఈ నెల 17న నిర్మల్, రాజన్న సిరిసిల్ల (800 మంది), 18న మంచిర్యాల, పెద్దపల్లి, హైదరాబాద్ (781 మంది) అభ్యర్థులకు ఎంపికలు జరుగుతాయి. 19న సిద్దిపేట, కరీంనగర్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. రన్నింగ్, ఫిజికల్ ఫిట్‌నెస్, మెడికల్ టెస్ట్‌లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఆర్మీ అధికారులు తెలిపారు.
Similar News
News November 11, 2025
ఢిల్లీలో జరిగిన మేజర్ బాంబు దాడులు

*అక్టోబర్ 9, 2005: దీపావళి తర్వాత రెండు రోజులకు 5.38PM-6.05PM మధ్య వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో 67 మంది మరణించారు.
*సెప్టెంబర్ 13, 2008: 6.27PMకు పోలీసులకు మెయిల్ వచ్చింది. దానికి స్పందించే లోపు 9 వరుస పేలుళ్లు జరిగాయి. 5 ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లలో 25 మంది చనిపోయారు.
*నేడు జరిగిన పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
News November 11, 2025
ప్రజావాణికి 29 ఫిర్యాదులు: రంగారెడ్డి కలెక్టర్

రంగారెడ్డి జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరింత శ్రద్ధ కనబరచాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి 29 ఫిర్యాదులు అందాయన్నారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News November 11, 2025
మంచిర్యాల: ‘రైతులకు ఇబ్బందు లేకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలి’

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పత్తి, వరి, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి సూచించారు. Hyd నుంచి మంత్రులు, అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.


