News November 22, 2025
హనుమకొండ: ‘ఆర్టీఐ కమిషన్ వద్ద 18 వేల పెండింగ్ దరఖాస్తులు’

రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ వద్ద సుమారు 18 వేల సెకండ్ అప్పీల్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర సమాచార కమిషనర్ అయోధ్యరెడ్డి అన్నారు. నేడు జిల్లాకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రెండున్నరేళ్లుగా ఆర్టీఏ కమిషన్ లేదని, అందువల్ల పెండింగ్‌లు పెరిగిపోయాయని తెలిపారు. ఐదు నెలల కాలంలో సుమారు 5 వేలకు పైగా దరఖాస్తులు పరిష్కరించామని, రాష్ట్రంలోని 17జిల్లాల్లో జీరో పెండింగ్ ఉండే విధంగా చేశామన్నారు.
Similar News
News November 23, 2025
HYD: నగరవాసులకు జలమండలి విజ్ఞప్తి

గుర్తు తెలియని మొబైల్ నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దని జలమండలి అధికారులు సూచించారు. నల్లా బిల్లు చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తామని కొందరు వినియోగదారులను SMS ద్వారా బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి మెసేజ్‌లకు స్పందించకూడదని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సందేశాల్లో వచ్చే APK డౌన్లోడ్ చేయొద్దన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే కస్టమర్ కేర్ నం. 155313ని సంప్రదించాలని కోరారు.
News November 23, 2025
ఉమ్మడి KNR డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ

తెలంగాణలోని పలు జిల్లాల కాంగ్రెస్ పార్టీ DCC అధ్యక్షుల జాబితాను AICC జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. కరీంనగర్ జిల్లా- చొప్పదండి MLA మేడిపల్లి సత్యం, పెద్దపల్లి జిల్లా – రామగుండం MLA రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, జగిత్యాల జిల్లా – గాజేంగి నందయ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా – సంగీతం శ్రీనివాస్‌లకు కాంగ్రెస్ అధిష్ఠానం అవకాశం కల్పించింది. వీరికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభినందనలు తెలిపారు.