News November 22, 2025
హనుమకొండ: ఈనెల 23, 24వ తేదీల్లో అండర్-14 క్రికెట్ జట్టు ఎంపిక

ఈనెల 23, 24వ తేదీల్లో హనుమకొండ జిల్లా కరుణాపురంలోని WDCA క్రికెట్ క్రీడా మైదానంలో ఉమ్మడి వరంగల్‌లోని 6 జిల్లాల అండర్-14 క్రికెట్ జట్టు ఎంపికలను నిర్వహించనున్నారు. 2011 సెప్టెంబర్ 1లోపు జన్మించిన ఆసక్తి గల క్రికెట్ క్రీడాకారులు మీ-సేవ జారీ చేసిన పుట్టినతేదీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, సొంత క్రికెట్ కిట్‌తో ఎంపిక పోటీలకు హాజరుకావాలని WDCA జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు.
Similar News
News November 22, 2025
అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలు

AP: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. సోమవారం నాటికి వాయుగుండంగా మారొచ్చని పేర్కొంది. ఈ క్రమంలో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అల్పపీడనం నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
News November 22, 2025
ADB: స్వచ్ఛంద సంస్థల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలో పలు సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్టెప్ సీఈవో రాజలింగు పేర్కొన్నారు. యువత సంక్షేమార్గం నైపుణ్య అభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థలు దరఖాస్తు చేసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. అర్హత గల సంస్థలు ngodarpan.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్టెప్ కార్యాలయంలో ఈనెల 30లోపు సమర్పించాలని సూచించారు.
News November 22, 2025
‘డిజిటల్ గోల్డ్’ను నియంత్రించం: సెబీ చీఫ్

డిజిటల్ గోల్డ్, ఈ-గోల్డ్ ఉత్పత్తులు తమ పరిధిలో లేవని, వాటిని నియంత్రించాలని అనుకోవడం లేదని SEBI చీఫ్ తుహిన్ పాండే తెలిపారు. సెబీ పరిధిలోని మ్యూచువల్ ఫండ్స్ ETFలు, ఇతర గోల్డ్ సెక్యూరిటీస్‌లో పెట్టుబడి పెట్టాలని సూచించారు. డిజిటల్ గోల్డ్ తమ పరిధిలోకి రాదని, అది రిస్క్ అని ఇటీవల సెబీ హెచ్చరించింది. దీంతో తమనూ నియంత్రణ పరిధిలోకి తీసుకురావాలని డిజిటల్ గోల్డ్ పరిశ్రమ కోరడంతో ఆయన క్లారిటీ ఇచ్చారు.


