News October 10, 2025
హనుమకొండ: ఐటీఐ కళాశాలలో అప్రెంటిస్‌షిప్ మేళా

ఈ నెల 13న హనుమకొండ ఐటీఐ కళాశాలలో అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జి.సక్రు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు apprenticeshipindia.gov.in/mela-registrationలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత ధ్రువపత్రాలతో మేళాకు హాజరుకావాలని సూచించారు. ఐటీఐ పాసై 28 ఏళ్ల లోపు ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
Similar News
News October 10, 2025
MBNR: SGF వాలీబాల్ జట్ల ఎంపిక

మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లి ZPHS(BOY’S) క్రీడా ప్రాంగణంలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్-17 విభాగంలోని బాల, బాలికలకు శుక్రవారం వాలీబాల్ టోర్నమెంట్ కామ్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి శారదాబాయి తెలిపారు. పాల్గొనే ప్రతి క్రీడాకారుడు బోనఫైడ్, ఆధార్, SGF అర్హత పత్రంతో ఉ.8.30 గంటలకు రిపోర్ట్ చేయాలన్నారు. పూర్తి వివరాలకు PD కళ్యాణ్‌ను సంప్రదించాలన్నారు.
News October 10, 2025
లివ్-ఇన్ రిలేషన్‌షిప్ వద్దు.. 50 ముక్కలవుతారు: గవర్నర్

నేటి తరం అమ్మాయిలు లివ్-ఇన్ రిలేషన్‌షిప్ (సహజీవనం)కు దూరంగా ఉండాలని ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ పిలుపునిచ్చారు. ‘లివ్-ఇన్ రిలేషన్‌షిప్స్ ఈ రోజుల్లో ట్రెండ్‌గా మారింది. 15-20 ఏళ్ల యువతులు బిడ్డలను కంటున్నారు. మన ఆడబిడ్డలు ఇలా చేయడం బాధగా ఉంది. సహజీవనానికి దూరంగా ఉండండి. లేకపోతే మీరు 50 ముక్కలై దొరుకుతారు. వాటికి దూరంగా ఉండాలి’ అని వారణాసిలో స్నాతకోత్సవ సభలో హెచ్చరించారు.
News October 10, 2025
విజయవాడ: దుర్గమ్మకు.. రెండు కోట్ల వజ్రాభరణాలు

రాబోయే వారం దుర్గమ్మకు ఒక ప్రముఖ వజ్రాభరణాల సంస్థ రూ. 2 కోట్లకు పైగా విలువైన ఆభరణాలను అందించనుంది. ఇందులో ముక్కుపుడక, మంగళసూత్రాలు వంటి వజ్రాభరణాలు ఉన్నాయి. ఈ ఆభరణాలను దేవస్థానంలో ఒక వేడుకగా అందజేయాలని సంస్థ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా దుర్గగుడి అభివృద్ధి ప్రణాళికలు, ప్రధాన ఆలయానికి స్వర్ణ తాపడం వంటి అంశాలను అధికారులు వివరించనున్నారు.