News September 20, 2025

హనుమకొండ కలెక్టరేట్‌లో లైంగిక వేధింపుల కలకలం..!

image

హనుమకొండ కలెక్టరేట్‌లోని ఓ సెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగినిని అదే సెక్షన్‌లో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ తన క్యాబిన్‌లోకి పిలిచి అసభ్యకరంగా వ్యవహరించాడని ఆరోపిస్తూ బాధిత మహిళ కలెక్టర్ స్నేహ శబరీష్‌కు ఫిర్యాదు చేయడం జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది. కాగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఫిర్యాదు అందుకున్న కలెక్టర్ తక్షణమే బదిలీ చేశారట.

Similar News

News September 20, 2025

రాయచోటిలో నలుగురి మృతి.. జగన్ దిగ్భ్రాంతి

image

రాయచోటిలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి<<17770012>> నలుగురు మృత్యువాత పడడంపై<<>> మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మురుగు కాలువల్లో కొట్టుకుపోయి నలుగురు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

News September 20, 2025

పరకామణి స్కామ్‌పై హై కోర్టు కీలక ఆదేశాలు

image

శ్రీవారి పరకామణిలో జరిగిన స్కామ్‌పై తిరుపతి లోక్‌అదాలత్ ఇచ్చిన తీర్పును హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. CBCID ఐజీని ఈ కేసులో 6వ ప్రతివాదిగా ఇంప్లీడ్ చేసింది. రికార్డులు, లోక్‌ అదాలత్ తీర్పు పత్రాలు, టీటీడీ బోర్డు తీర్మానాలు తదితర వాటిని సీల్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అలాగే, ప్రతివాదులు రెండు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని గడువు ఇచ్చింది.

News September 20, 2025

రేపటి నుంచి దసరా సెలవులు

image

TG: గురుకులాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు దసరా సెలవులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3 వరకు సెలవులు ఉండనున్నాయి. అటు జూనియర్ కాలేజీలకు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు హాలిడేస్ ప్రకటించారు. మరోవైపు గురుకుల సొసైటీ పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కాలేజీలకు మాత్రం వారం రోజులు ఆలస్యంగా సెలవులు ఇచ్చారని, వాటికి కూడా రేపటి నుంచే సెలవులు ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.