News October 14, 2025
హనుమకొండ: కార్పొరేటర్ ఇంట్లో పేకాట.. 12 మంది అరెస్ట్

హనుమకొండ సుబేదారి కనకదుర్గ కాలనీలోని ఓ కార్పొరేటర్ ఇంట్లో పేకాట శిబిరంపై టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ నేతృత్వంలో పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు మహిళలతో సహా 12 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 60 వేల నగదు, 9 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News October 14, 2025
విశాఖ: బంపర్ డ్రా.. లింక్ క్లిక్ చేస్తే..!

ఆన్‌లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ సిటీ పోలీసులు సూచించారు. లాటరీ, బంపర్ డ్రాలు గెలుచుకున్నారంటూ సైబర్ నేరగాళ్లు ఆశ చూపిస్తారని, అది నమ్మి లింక్ క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు కోల్పోతారని చెప్పారు. అటువంటి మెసెజ్‌లకు స్పందించవద్దని కోరారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే టోల్‌ఫ్రీ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలన్నారు.
News October 14, 2025
వీటికి దూరంగా ఉంటే సంతోషమే!

మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ‘ఇతరుల మీద ఫిర్యాదులు చేయడం, గుసగుసలు మాట్లాడటం, ఈర్ష్య, ఎదుటివారితో పోల్చుకోవడం, అతి వ్యసనాలు, అనుమానం, భయం, ద్వేషం’ వంటివి ‘మానసిక క్యాన్సర్ల’తో సమానం అని చెబుతున్నారు. ఇవి మన మనసును, శరీరాన్ని నెమ్మదిగా కుంగదీస్తాయంటున్నారు. వీటికి దూరంగా ఉంటే ఎంతో సంతోషంగా ఉంటారని సూచిస్తున్నారు. మీరేమంటారు?
News October 14, 2025
కోడూరు: ‘ట్రైన్‌లో నిద్రిస్తూనే కన్నుమూశాడు’

కోడూరు(M) పోటుమీదతకు చెందిన శీలం బాపనయ్య(65) షిరిడీ యాత్రకు వెళ్లి మంగళవారం ఉదయం మృతి చెందారు. సోమవారం ఇంటి వద్ద నుంచి తోటి యాత్రికులతో కలిసి షిరిడీ బయలుదేరారు. మంగళవారం షిరిడీ సమీపంలో నాగర్ సోల్ రైల్వే స్టేషన్‌లో ట్రైన్ దిగేందుకు నిద్రిస్తున్న బాపనయ్యను లేపగా అప్పటికే మృతి చెందినట్లు తోటి వారు తెలిపారు. బాపనయ్య మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.