News February 8, 2025

హనుమకొండ: గ్రామాల్లో మొదలైన ‘స్థానిక’ సందడి!

image

ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నాయి. దీంతో హనుమకొండ జిల్లాలోని గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ఆశావహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్య నేతలను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.

Similar News

News April 13, 2026

NLG: అంగన్‌వాడీలో చిన్నారులకు డ్రెస్‌కోడ్..!

image

అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుకునే చిన్నారుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి చిన్నారులకు ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ను అమలు చేయనున్నట్లు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణవేణి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 9 ప్రాజెక్టుల పరిధిలో 2093 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. 45,543 మంది చిన్నారులకు త్వరలో దుస్తులు పంపిణీ చేస్తామన్నారు.

News April 13, 2026

వరంగల్ ఆర్వోలో అవినీతి.. మరో అధికారి సస్పెండ్

image

వరంగల్ ఆర్వో సబ్ రిజిస్ట్రార్-1 జమలాపురి రామనర్సింహారావును సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 3న ఏసీబీ దాడుల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు, ఆస్తులు బయటపడిన విషయం తెలిసిందే. ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్-2 ఆనంద్‌ను సస్పెండ్ చేయగా, ఇద్దరి మధ్య రూ.43 లక్షల ఆన్‌లైన్ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటన వరంగల్ ఆర్వో కార్యాలయంలో సంచలనం రేపింది.

News April 13, 2026

మహిళల్లో ఐరన్ లోపం లక్షణాలివే..

image

మహిళల్లో ఐరన్ లోపం ఉంటే అలసట, బలహీనత ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జుట్టు ఎక్కువగా రాలడం కూడా ఐరన్ లోపానికి సంకేతాలే. దీన్ని తగ్గించడానికి పాలకూర, బీట్‌రూట్, పప్పులు, మాంసం, గుడ్లు, డ్రై ఫ్రూట్స్, విత్తనాలు తీసుకోవాలి. అలాగే టమిన్-సి ఐరన్ శోషణకు సహాయపడుతుంది. నారింజ, నిమ్మకాయ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ వంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.