News February 11, 2025
హనుమకొండ: చికెన్ సెంటర్ యజమానికి రూ.30 వేల పెనాల్టీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739286521645_51243309-normal-WIFI.webp)
అపరిశుభ్ర ప్రదేశంలో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న యజమానికి రూ.30 వేలు పెనాల్టీ విధించినట్లు బల్దియా ముఖ్యఆరోగ్యాధికారి డా.రాజారెడ్డి తెలిపారు. న్యూశాయంపేటలోని వినాయక చికెన్ సప్లయర్స్ యాజమాన్యం సరియైన హైజీన్ పద్ధతులు పాటించడం లేదని ఆయన అన్నారు. దుకాణ ఆవరణ అపరిశుభ్రంతో పాటు చికెన్ వ్యర్థాలను డ్రైనేజీలో వదిలినందకు పెనాల్టీ విధించామన్నారు.
Similar News
News February 12, 2025
ఈరోజు నమాజ్ వేళలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1738056116086_1226-normal-WIFI.webp)
✒ తేది: ఫిబ్రవరి 12, బుధవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.40 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
✒ ఇష: రాత్రి 7.30 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 12, 2025
KNR: కెనాల్ కాలువలో ఈతకు వెళ్లి ఒకరు మృతి, మరొకరు గల్లంత్తు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739292918819_60382139-normal-WIFI.webp)
హుజూరాబాద్ మండలం పోతిరెడ్డి పేట గ్రామంలో విషాదం నెలకొంది. ఎస్సారెస్పీ కెనాల్ కాలువలో ఈతకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గ్రామస్థుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఒకరి మృతదేహం లభించింది. పోలీసులు గజఈత గాళ్ల సాయంతో మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 12, 2025
పెద్దపల్లి: ‘స్థానిక సంస్థల గత రిజర్వేషన్లు ఓసారి చూడండి’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739285327534_51751241-normal-WIFI.webp)
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఓట్ల కంటే ముందే జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రచారం సాగుతుంది. పెద్దపల్లి జిల్లాలో 13 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో UR-7, BC-3, SC-3 రిజర్వేషన్‌లు కేటాయించారు. అందులో మహిళా-7, జనరల్-6 స్థానాలు కేటాయించారు. జిల్లాలోని ఆశావాహులు వారి మండలానికి తమకు అనుకూలంగా జడ్పీటీసీ రిజర్వేషన్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.