News March 16, 2025
హనుమకొండ జిల్లాలో చికెన్ ధరలు ఇలా

వరంగల్, హనుమకొండ జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్(విత్ స్కిన్) కేజీ రూ.160-180 ఉండగా.. స్కిన్‌లెస్ కేజీ రూ.200 ధర పలుకుతోంది. అలాగే లైవ్ కోడి రూ.120-130 మధ్య ఉంది. కాగా, బడ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా.. ప్రస్తుతం అమ్మకాలు పెరగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు.
Similar News
News September 18, 2025
APPLY NOW: ఇస్రోలో ఉద్యోగాలు

<
News September 18, 2025
ప.గో: ఈ నెల 19న డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 19న అమరావతిలో నియామక పత్రాలు అందజేస్తారని జిల్లా విద్యాశాఖాధికారిని ఎం. వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఆ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులందరూ 18న సాయంత్రం 4 గంటలకు ఏలూరులోని రిసీవింగ్ సెంటర్‌కు చేరుకోవాలని, అక్కడి నుంచి 19న అమరావతికి బయలుదేరుతారని ఆమె వెల్లడించారు.
News September 18, 2025
ఉత్తరాఖండ్‌లో పేరేచర్ల యువకుడి మృతి

ఉత్తరాఖండ్‌లోని రుషికేశ్ ఎయిమ్స్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామానికి చెందిన జగదీశ్‌బాబు (30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కష్టపడి జాతీయ స్థాయిలో మంచి ర్యాంకు సాధించి, వైద్య సీటు పొందిన జగదీశ్ మృతి పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. బుధవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.