News March 6, 2025
హనుమకొండ జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

✓ HNK: నకిలీ పురుగు మందుల ముఠా అరెస్ట్ ✓ HNK: శిరీష హత్య కేసులో కీలక మలుపు ✓ అర్ధరాత్రి నగరంలో ముమ్మర తనిఖీలు ✓ WGL జిల్లాలో విషాదం.. యువకుడి ఆత్మహత్య ✓ WGL: డ్రంక్ అండ్ డ్రైవ్.. జరిమానా ✓ పరకాల పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్
Similar News
News March 6, 2025
సిద్దిపేట: MLC కౌంటింగ్.. 60 గంటలు సాగింది

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. ఈనెల 3న ఉ. 8 గంటలకు చెల్లుబాటయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయడం మెుదలు పెట్టగా మంగళవారం ఉ. 10 గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది. 11 గంటలకు అభ్యర్థులకు పోలైన ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేయగా బుధవారం 8 గంటలకు అంటే సుమారు 60 గంటల వరకు సాగింది.
News March 6, 2025
తిరుపతి: దొంగల ముఠా అరెస్ట్

ఎవరు లేని ఇళ్లను పగలు నిఘా పెట్టి రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. వారి నుంచి రూ.35 లక్షల విలువగల 501 గ్రా. బంగారం, 1,20,000 విలువగల 2116 గ్రాముల వెండి నగలు, ఒక కారు, ఒక ఆటో, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో కొందరిపై పలు కేసులు నమోదు అయ్యాయని వివరించారు. వీరిని పట్టుకోవడంలో ప్రతిభ చాటిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
News March 6, 2025
ఈనెల 8న మహిళాశక్తి పాలసీ విడుదల

TG: ఈనెల 8న జరగనున్న మహిళా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా శక్తి పాలసీ విడుదల చేయనున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్‌లో సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చే అవకాశముండటంతో తగిన ఏర్పాట్లు చేయాలని, మజ్జిగప్యాకెట్లు అందించాలని అధికారులను ఆదేశించారు.