News March 21, 2025
హనుమకొండ జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

✓ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ముందస్తు సమాచారం సేకరించాలి
✓ ACBకి చిక్కిన స్టేషన్ ఘనపూర్ సబ్ రిజిస్ట్రార్
✓ ముల్కనూరు: రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలు
✓ HNK: రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జైన వ్యక్తి మృతి
✓ HNK: అక్రమ రవాణాపై బస్టాండ్లో ఆర్టీసీ ప్రయాణికులకు అవగాహన
✓ ప్రమాదకరంగా మారిన చెట్లను తొలగించిన దామెర పోలీసులు
Similar News
News January 8, 2026
జాతీయ షూటింగ్ బాల్ పోటీలకు కృష్ణా జిల్లా క్రీడాకారులు

మహారాష్ట్రలోని సోలాపూర్‌లో జనవరి 8 నుంచి 10 వరకు జరిగే సీనియర్ జాతీయ షూటింగ్ బాల్ పోటీలకు కృష్ణా జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. కావలిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన పి.హనీత్ నాగ్, పి.శరన్ హేమంత్, సురేఖ జాతీయ స్థాయికి అర్హత సాధించారు. విజయవాడ నుంచి పోటీలకు బయలుదేరిన ఈ క్రీడాకారులను పలువురు ప్రముఖులు అభినందిస్తూ, పతకాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.
News January 8, 2026
NLR: వృద్ధాశ్రమాలకు అనుమతులు ఉండాల్సిందే..!

నెల్లూరు జిల్లాలో వృద్ధాశ్రమాల నిర్వహణకు స్వచ్ఛంద సేవా సంస్థలు తప్పనిసరిగా అనుమతులు పొందాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల వృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు అహ్మద్ అయూబ్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. అనుమతులు లేని వయోవృద్ధుల ఆశ్రమాలపై 2007 వయోవృద్ధుల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరిన్ని వివరాలకు నెల్లూరులోని తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
News January 8, 2026
ఆదిలాబాద్: విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలుకల్పించాలి: కలెక్టర్

నార్నూర్ ఆస్పిరేషనల్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంగ్లీష్ ఫౌండేషన్ అభ్యాసన నైపుణ్యాలు, తదితర అంశాలపై విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఆంగ్ల భాషపై పట్టు సాధించడం ఎంతో అవసరమన్నారు.


