News December 11, 2025

హనుమకొండ జిల్లాలో పోలింగ్ షురూ..

image

హనుమకొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ మొదలైంది. 3 మండలాల్లోని 69 గ్రామాలు, 658 వార్డుల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరుగుతుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

Similar News

News December 12, 2025

ములుగు: రేపు నవోదయ ప్రవేశ పరీక్ష

image

జవహర్ నవోదయ విద్యాలయం-మామునూరు ప్రవేశ పరీక్ష రేపు జరగనుంది. ములుగు(D)లో 515 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏటూరునాగారం జడ్పీహెచ్ఎస్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో 162 మంది, ములుగు మండలం బండారుపల్లి మోడల్ స్కూల్లో 192 మంది, జిల్లా కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్‌లో 161 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్ష సమయం ఉ. 11:30 నుంచి మ.1:30 విద్యార్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి.

News December 12, 2025

మాతృత్వంతో సేవ.. ఊట్కూర్‌కు కొత్త నాయకత్వం రేణుక

image

ఊట్కూర్ సర్పంచ్ అభ్యర్థి రేణుక మాతృత్వాన్ని మోస్తూనే ప్రజల సేవ కోసం ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. అలసట, వాతావరణం, పరిస్థితులు అడ్డుకాలేకుండా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, గ్రామ అభివృద్ధిపట్ల తన అంకితభావాన్ని చూపిస్తున్నారు. రేణుక సంకల్పం ఓటర్ల హృదయాలను తాకుతుంది. ఊట్కూరును ముందుకు తీసుకెళ్తా” అని రేణుక హామీ ఇస్తూ ఓటర్ల మనసులు గెలుచుకుంటున్నారు. మహిళా నాయకత్వ స్వాలంబనకు ప్రేరణగా నిలుస్తోంది.

News December 12, 2025

ముగిసిన ప్రచారం.. ఇక ప్రలోభాల పర్వం !

image

సంగారెడ్డి జిల్లాలోని 10 మండలాల్లో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం శుక్రవారం 5 గంటలకు ముగిసింది. ఇప్పటివరకు రాజకీయ నాయకుల ప్రచారాలతో సందడి చేసిన గ్రామాలు ఒక్కసారిగా విలవిలపోయాయి. ప్రచార నిషేధం అమల్లోకి రావడంతో ఇక ప్రలోభాల ఎర ప్రారంభమైంది. ఓటర్లకు మద్యం డబ్బులు పంపిణీ చేసేందుకు పోటీ చేస్తున్న నాయకులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.