News February 25, 2025
హనుమకొండ: తండ్రిని చంపిన కొడుకు

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మామునూరు భాస్కర్(46)ను అతడి కొడుకు అరుణ్(22) కత్తితో పొడిచాడు. భాస్కర్‌ను హాస్పిటల్ తీసుకెళ్లే క్రమంలో చనిపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 25, 2025
‘రాష్ట్ర ప్రేరణా స్థల్’ను ప్రారంభించిన మోదీ.. ఏంటిది?

లక్నోలో(UP) ₹230 కోట్లతో, 65 ఎకరాల్లో నిర్మించిన ‘రాష్ట్ర ప్రేరణా స్థల్’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇక్కడ శ్యామప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, వాజ్‌పేయి కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేశారు. వారి గొప్ప ఆలోచనలు, సుపరిపాలన పాఠాలను ముందు తరాలకు అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని ప్రధాని వివరించారు. దేశ సేవ, నాయకత్వ విలువలు, సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించే వేదికగా ఈ కేంద్రం నిలుస్తుందన్నారు.
News December 25, 2025
శివకోడులో మెట్లపై నుంచి జారిపడి యువ ఆర్టిస్ట్ మృతి

కోనసీమ జిల్లా శివకోడులో జరిగిన ప్రమాదంలో రాజమహేంద్రవరానికి చెందిన యువ ఆర్టిస్ట్ పాలపర్తి భవ్యశ్రీ(17) దుర్మరణం పాలైంది. జాతరలో ప్రదర్శన ముగించుకుని మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడింది. తలకు తీవ్ర గాయాలవ్వడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కళాకారిణి మృతితో కుటుంబ సభ్యులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈమె జాతరలలో పలు డ్యాన్స్ ప్రొగ్రామ్స్‌లో డ్యాన్స్ చేసినట్లు సమాచారం.
News December 25, 2025
కొబ్బరి తోటలకు ‘తెల్లదోమ’ ముప్పు: సాజా నాయక్

జిల్లాలో 13,650 హెక్టార్లలో విస్తరించిన కొబ్బరి తోటలపై రాబోయే మూడు నెలల్లో తెల్లదోమ ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ అధికారి సాజా నాయక్ హెచ్చరించారు. దీని నివారణకు పవర్ స్ప్రేయర్‌తో నీళ్లు, వేపనూనె, ఈసారియా ఫ్యూమోసోరోజియా పిచికారీ చేయాలని సూచించారు. పసుపు రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేయడంతో పాటు, మిత్రకీటకాలను సంరక్షించుకోవడం ద్వారా తెల్లదోమను అరికట్టవచ్చని గురువారం తెలిపారు.


