News February 25, 2025

హనుమకొండ: తండ్రిని చంపిన కొడుకు.. కారణమిదే..!

image

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు గ్రామంలో భాస్కర్ అనే వ్యక్తిని అతడి కొడుకు అరుణ్ కత్తితో పొడిచి <<15578307>>చంపిన విషయం<<>> తెలిసిందే. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. భాస్కర్ తరచూ తాగొచ్చి భార్యను తిడుతూ, గొడవ పడుతూ ఉండేవాడు. ఈక్రమంలో పిల్లలను, తల్లిని అంతు చూస్తా అని బెదిరించాడు. దీంతో క్షణికావేశంలో చిన్నకొడుకు అరుణ్ పక్కనే ఉన్న కత్తితో తండ్రిని పొడిచాడు. పెద్దకొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

Similar News

News December 23, 2025

గిద్దలూరులో షాకింగ్ ఘటన.. పోక్సో కేసు నమోదు!

image

గిద్దలూరులో బాలికపై లైంగిక దాడి ఘటన కలకలం రేపింది. 9వ తరగతి చదువుతున్న బాలికను బెదిరించి స్కూల్ నుంచి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో టి. వెంకటేశ్వర రెడ్డిపై గిద్దలూరు పోలీసులు POCSO చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను బెదిరించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. దీంతో గిద్దలూరు టౌన్ సీఐ సురేశ్ దర్యాప్తు చేస్తున్నారు.

News December 23, 2025

ప్రమాదంలో బాపట్ల జిల్లా రిటైర్డ్ జవాన్ మృతి

image

రోడ్డు ప్రమాదంలో జవాన్ మృతి చెందిన ఘటన బాపట్ల మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ముక్తాయపాలెంకు చెందిన రిటైర్డ్ జవాన్ శ్రీనివాస వరప్రసాద్ సూర్యలంక రహదారిలో చింతావారిపాలెం వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని బైక్‌పై వెళ్తుండగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వైద్యశాలకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 23, 2025

మోటకొండూరు: పోరాడితేనే హక్కులను సాధించుకోగలం: కవిత

image

పోరాడితేనే హక్కులను సాధించుకోగలమని తెలంగాణ జన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జన జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా మంగళవారం యాదాద్రి జిల్లా మోటకొండూరులో ఆమె మాట్లాడారు. భూ నిర్వాసితులకు అండగా ఉంటామన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదన్నారు. రూ.4,000 పెన్షన్, మహిళలకు రూ.2,500 ఆర్థిక సహాయం ఇవ్వలేదన్నారు.