News March 20, 2025
హనుమకొండ: నేడు ప్రారంభం కానున్న పండ్ల మార్కెట్

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని ముసలమ్మకుంట గోదాముల వద్ద ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్‌ను గురువారం మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు ప్రారంభిస్తారని మార్కెట్ కార్యదర్శి గుగులోతు రెడ్యా తెలిపారు. ఈ మేరకు మామిడికాయల సీజన్ ప్రారంభమైనందున ముసలమ్మకులో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు.
Similar News
News December 22, 2025
స్వయంకృషి: Tutor.. టైమ్, మ్యాటర్ ఉంటే చాలు

పిల్లలకు ట్యూషన్ చెబుతూ సాఫ్ట్వేర్ ఎంప్లాయి రేంజ్ ఆదాయం పొందొచ్చు తెలుసా. కావాల్సింది సబ్జెక్టుపై పట్టు, వివరించగల సామర్థ్యంతో పాటు సమయం. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లోనూ చెప్పొచ్చు. నగరాల్లో ఇంటికి పిలిపించి మరీ పిల్లలకు ట్యూషన్స్ పెట్టించేందుకు చాలామంది పేరంట్స్ రెడీగా ఉన్నారు. ఏదైనా పని చేస్తూ అదనపు ఆదాయంగా లేదా ఇదే పనిగా ఎంచుకొని ప్లానింగ్‌తో కెరీర్‌గా మార్చుకోవచ్చు.
-డైలీ 1pmకు ఓ బిజినెస్ ఐడియా
News December 22, 2025
స్నానం చేయకుండా వంటింట్లోకి వెళ్లవచ్చా?

వంటిల్లును మనం అన్నపూర్ణా దేవి నిలయంగా భావిస్తాం. అందుకే ఇల్లాలు స్నానమాచరించాకే వంట గదిలోకి ప్రవేశించాలని పెద్దలు చెబుతారు. మన శరీర శుద్ధి మనసుపై ప్రభావం చూపుతుంది. శుభ్రంగా ఉండి వండిన ఆహారం అమృతంతో సమానం. అది కుటుంబానికి ఆరోగ్యాన్ని, శక్తిని ఇస్తుంది. స్నానం చేయకుండా వంట చేస్తే ప్రతికూల శక్తి ప్రసరిస్తుంది. అనారోగ్యానికి కారణమవ్వొచ్చు. ఈ నియమాలతో లక్ష్మీ కటాక్షం, ప్రశాంతత చేకూరుతాయని నమ్మకం.
News December 22, 2025
డోన్: ఏసీబీ వలలో సీనియర్ అసిస్టెంట్

డోన్ ఉప ఖజానా కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రిటైర్డ్ అధికారి శ్యామ్ రాజు ఫిర్యాదు మేరకు సీనియర్ అసిస్టెంట్ ఆర్.లక్ష్మణ్ నాయక్ పని పూర్తి చేసేందుకు రూ.30,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. లంచం తీసుకున్న సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీబీ హెచ్చరించింది.


