News March 18, 2025

హనుమకొండ: ‘పది’ పరీక్ష పదిలంగా!

image

ఈ నెల 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా పరీక్షలు దగ్గర పడటంతో కొంతమంది విద్యార్థులు గాబరా పడి సమాధానం తెలిసినా సరిగా రాయలేకపోతుంటారు. వారంతా ఒత్తిడికి లోనుకాకుండా నేను బాగా చదివాను.. బాగా రాస్తాను అని కాన్ఫిడెంట్‌గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.వీరంతా సెల్‌ఫోన్, టీవీకి దూరంగా ఉన్నట్లయితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 12,010 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

Similar News

News February 22, 2026

అభిషేక్‌కు అగ్నిపరీక్ష: నేడైనా ఫామ్ అందుకుంటాడా?

image

SAతో నేడు జరిగే సూపర్-8 పోరులో అందరి దృష్టి భారత ఓపెనర్ అభిషేక్ శర్మపైనే ఉంది. ఈ WCలో 3 సార్లు డకౌట్ అయి నిరాశపరిచిన అతను.. నేడైనా ఫామ్‌లోకి రావాలని అంతా ఆశిస్తున్నారు. రబాడ, మార్క్రమ్ వేసే పవర్‌ప్లే ఓవర్లు అతనికి సవాలుగా మారనున్నాయి. మిడిల్ ఆర్డర్‌లో సూర్య, తిలక్ నెమ్మదిగా ఆడుతుండటంతో అభిషేక్ ఇచ్చే స్టార్ట్ భారత్‌కు చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో విఫలమైతే అతని స్థానం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

News February 22, 2026

కర్నూలు జిల్లాలో కేంద్ర మంత్రి పర్యటన వివరాలు

image

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి ఈ నెల 22, 23 తేదీలలో కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నట్లు ఆదోని సమాచార శాఖ అధికారులు తెలిపారు. ఆయన 22న ఉదయం బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి కర్నూలుకు చేరుకుంటారు. రోడ్డు మార్గాన అలంపూర్ చేరుకొని జోగులాంబను దర్శించుకుంటారు. తిరిగి కర్నూలు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మంత్రాలయం చేరుకుని రాఘవేంద్ర స్వామి గురు వైభోత్సవంలో పాల్గొంటారు.

News February 22, 2026

శ్రీలీలకు బంపర్ ఆఫర్: అజిత్ సరసన క్రేజీ ఛాన్స్!

image

తెలుగు స్టార్ హీరోయిన్ శ్రీలీలకు తమిళంలో అద్భుతమైన అవకాశం దక్కినట్లు సమాచారం. కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ నటిస్తున్న ‘AK64’ చిత్రంలో ఆమెను కథానాయికగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది.