News March 1, 2025

హనుమకొండ: పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

image

మార్చి 21 నుంచి ప్రారంభమవుతున్న పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లను చేస్తున్నట్లు హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.

Similar News

News March 1, 2025

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఇంటర్ పరీక్షలు మొదలు కాబోతున్నాయి. ఉ.9 – మ.12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. 10.58 లక్షల మంది పరీక్షలు రాయనుండగా నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించేది లేదని అధికారులు చెబుతున్నారు. పరీక్షా కేంద్రాలను ‘నో మొబైల్’ జోన్‌గా ప్రకటించారు. ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకొని ఒత్తిడి లేకుండా ఎగ్జామ్ రాయాలని విద్యార్థులకు Way2News సూచిస్తోంది. ALL THE BEST.

News March 1, 2025

కర్నూలు జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

image

కర్నూలు జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉ.9 నుంచి మ.12 వరకు పేపర్-1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. జిల్లాలోని 69 పరీక్ష కేంద్రాల్లో.. మొత్తంగా 23,098 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కాగా పరీక్షల నిర్వహణకు 950 మంది ఇన్విజిలేటర్లను జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు నియమించారు.☞ విద్యార్థులకు ALL THE BEST

News March 1, 2025

సెమీస్‌కు వెళ్లాలని సౌతాఫ్రికా.. పరువు కోసం ఇంగ్లండ్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ మ.2.30 గంటలకు సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. గ్రూప్-బిలో 3 పాయింట్లతో రెండోస్థానంలో ఉన్న SA ఇందులో గెలిచి సెమీస్ చేరాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓడి సెమీస్ రేస్ నుంచి తప్పుకున్న ENG చివరి గేమ్‌లోనైనా గెలవాలని ఆరాటపడుతోంది. ఇప్పటికే AUS సెమీస్‌లో అడుగుపెట్టింది. ENG చేతిలో SA భారీ తేడాతో ఓడితే అఫ్గాన్‌ సెమీస్ చేరుతుంది.

error: Content is protected !!