News December 24, 2025
హనుమకొండ: పార్టీ గుర్తుతో పోటీకి ప్రణాళికలు..!

హనుమకొండ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల సందడి ముగియడంతో నేతలు ZPTC, MPTC ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన వారు, రిజర్వేషన్ అనుకూలించని వారు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చర్చ నడుస్తోంది. పార్టీ గుర్తుతో పోటీ చేసేందుకు నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. హనుమకొండ జిల్లాలో 12 ZPTC, MPP స్థానాలు, 129 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.
Similar News
News December 27, 2025
కమ్యూనిస్టు ఉద్యమాలకు పురిటి గడ్డగా నల్లగొండ జిల్లా

తెలంగాణ ఉద్యమాలకు నిలయమైన నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు రాజకీయాలకు కేంద్రంగా నిలిచింది. పేదలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం సీపీఐ జిల్లాలో దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది. భూమి హక్కులు, సాగునీరు, ఉపాధి, గిట్టుబాటు ధరలు, ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్వహించింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలమైన పార్టీ నిర్మాణంతో ప్రజల మధ్య పని చేస్తూ సమ సమాజ సాధనే లక్ష్యంగా సీపీఐ ముందుకు సాగుతోంది.
News December 27, 2025
బాపట్ల జిల్లా రాష్ట్రంలోనే ఐదో స్థానం: కలెక్టర్

గంజాయి ఉత్పత్తుల నియంత్రణ, మహిళలపై నేరాల నియంత్రణలో బాపట్ల జిల్లా రాష్ట్రంలోనే ఐదో స్థానంలో నిలిచిందని కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. ఈ విషయంపై ఇటీవల కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నుంచి బాపట్ల జిల్లా ఎస్పీ ప్రశంసలు అందుకున్నారని అభినందించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల నియంత్రణపై పాఠశాలలు, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు.
News December 27, 2025
గంజాయి వినియోగంపై ఉక్కుపాదం: ఎస్పీ

జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపట్టామని ఎస్పీ తెలిపారు. గంజాయి వినియోగించే 71 ప్రాంతాలను గుర్తించామని, ‘ఈగల్ టీం’ సమర్థంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఒడిశా నుంచి సాగుతున్న అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు, జిల్లాలో గంజాయి ఉత్పత్తులను పూర్తిగా అరికట్టామన్నారు. యువత మత్తుకు దూరంగా ఉండాలని, నిఘా ముమ్మరం చేశామని ఆయన వివరించారు.


