News September 13, 2025
హనుమకొండ: పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: మంత్రి

రాష్ట్రంలోని పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. హనుమకొండలోని రాంనగర్ నివాసంలో ఆమె ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రతిపక్షాలు తమ రాజకీయ ఉనికి కోసమే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Similar News
News September 14, 2025
GDK: లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం: జడ్జి

లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం పొందుతారని గోదావరిఖని అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. జాతీయ లోక్ అదాలత్ ను పురస్కరించుకుని స్థానిక జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ లో ఆయన మాట్లాడారు. లోక్ అదాలత్ లలో రాజీ కుదుర్చుకుంటే ఒకరు గెలిచి, మరొకరు ఓడినట్లు కాదన్నారు. రాజీ పడిన వివిధ కేసులను ఆయన కొట్టివేశారు.
News September 14, 2025
కరీంనగర్: సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీసులు కార్యక్రమం నిర్వహించారు. సైబర్ క్రైమ్ డీఎస్పీ కోత్వాల్ రమేష్ మాట్లాడుతూ, ఆధార్ కార్డు మోసాలు, ఏపీకే ఫైల్స్, సిమ్ కార్డుల దుర్వినియోగం, బ్యాంక్ ఖాతా సమాచారం, లింక్స్, పెట్టుబడుల మోసాలు, డిజిటల్ అరెస్ట్, సోషల్ మీడియా ఫ్రాడ్స్ వంటి నేరాలపై ప్రజలను అప్రమత్తం చేశామన్నారు.
News September 14, 2025
బాలయ్య తరఫున సీఎంకు రూ.50 లక్షల చెక్కు అందజేత

TG: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన కామారెడ్డి సహా ఇతర ప్రాంతాల రైతులకు అండగా నిలిచేందుకు CMRFకు నందమూరి బాలయ్య రూ.50 లక్షల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చెక్కును ఆయన తరఫున చిన్న కూతురు తేజస్విని సీఎం రేవంత్‌కు అందజేశారు. ఇటీవల విరాళం ప్రకటించిన సందర్భంగా భవిష్యత్తులోనూ తన వంతుగా ఇలాంటి సహాయాలు చేస్తానని బాలయ్య పేర్కొన్నారు.