News March 13, 2025
హనుమకొండ: ప్రచార పత్రికలను ఆవిష్కరించిన డీఈవో

ఇస్రో విద్యార్థులకు నిర్వహిస్తున్న యువిక-2025 ప్రచార పత్రికలను హనుమకొండ డీఈవో వాసంతి, ఇస్రో ట్యూటర్‌గా ఎంపికైన భూపతి శశాంక్ ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సాహించాలని డీఈవో వాసంతిని శశాంక్ కోరారు. సానుకూలంగా స్పందించిన డీఈవో ప్రధానోపాధ్యాయులతో ఒక సమావేశాన్ని నిర్వహిస్తానని తెలిపారు.
Similar News
News March 13, 2025
అసెంబ్లీ వద్ద భారీగా మార్షల్స్ మోహరింపు

తెలంగాణ అసెంబ్లీలో ఘర్షణ వాతావరణం నెలకొంది. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి <<15744584>>వ్యాఖ్యలు<<>> తీవ్ర దుమారం రేపాయి. దీంతో సభను స్పీకర్ వాయిదా వేయగా కొద్దిసేపటి క్రితమే తిరిగి పున:ప్రారంభం అయింది. జగదీశ్‌పై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అటు సభ వద్ద భారీగా మార్షల్స్‌ను మోహరించారు.
News March 13, 2025
KMR: హోలీని సురక్షితంగా జరుపుకోవాలి: SP

కామారెడ్డి జిల్లా ప్రజలు హోలీ పండుగను సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర కోరారు. గురువారం ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా మద్యం మత్తులో వాహనాలు నడుపోద్దన్నారు. చెర్వుల్లో, కుంటల్లో లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదబారిన పడవద్దని సూచించారు. సురక్షితమైన రంగులను వాడి హోలీ జరుపుకోవాలన్నారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.
News March 13, 2025
నల్గొండ: పోలీస్ శాఖకు టీం స్పిరిట్ చాలాముఖ్యం: కలెక్టర్

పోలీస్ శాఖకు టీంస్పిరిట్ చాలా ముఖ్యమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌ను గురువారం ఎస్పీ శరత్ చంద్ర పవర్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలీస్ ఉద్యోగం ఒత్తిడితో చేసే ఉద్యోగమని.. శారీరక స్ఫూర్తితో పాటు మానసికంగా అలర్ట్ కావడానికి క్రీడలు ఉపయోగపడతాయన్నారు.