News September 22, 2025

హనుమకొండ ప్రజావాణిలో 157 విజ్ఞప్తులు

image

HNK కలెక్టరేట్‌లో సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని విన్నవిస్తూ 157 వినతులను అందజేశారని అధికారులు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి వై.వి.గణేశ్ పాల్గొని ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు.

Similar News

News September 22, 2025

బాపట్ల: ఎస్పీ కార్యాలయానికి 65 అర్జీలు

image

బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSకు 65 అర్జీలు వచ్చినట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద ఆయన వినతి పత్రాలు స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు బాధితులు ఆయన దగ్గరకు వెళ్లలేక ఇబ్బంది పడగా, ఆయనే వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

News September 22, 2025

అనంతపురం జిల్లాకు స్కోచ్ అవార్డు

image

అనంతపురం జిల్లాలో APMIP వివిధ పథకాల ద్వారా స్కోచ్ అవార్డును దక్కించుకుంది. కాగా అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో APMIP అధికారులు కలెక్టర్ ఆనంద్‌కు ఈ అవార్డును అందజేశారు. ఈ విజయం సంతోషంగా ఉందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణన్ శర్మ, APMIP PD రఘునాథ్‌రెడ్డి, ఉద్యాన శాఖాధికారి ఉమాదేవి పాల్గొన్నారు.

News September 22, 2025

ఆలూరు టీడీపీ నూతన ఇన్‌ఛార్జ్‌గా వైకుంఠం జ్యోతి

image

ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా వైకుంఠం జ్యోతి ఎన్నికైనట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పల్లా శ్రీనివాస్ అధికారంగా ప్రకటించారు. ఈ సందర్భంగా వైకుంఠపు జ్యోతి మాట్లాడుతూ.. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యలు తీర్చడంలో తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు, పల్లా శ్రీనివాస్‌కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.