News February 26, 2025
హనుమకొండ: మత్తు పదార్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు: డీసీపీ

హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఫిబ్రవరి నెలలో నమోదైన 9 గంజాయి కేసులతో పాటు గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై వివిధ శాఖల అధికారులతో చర్చించారు.
Similar News
News February 26, 2025
కార్ లోన్ తీసుకుంటున్నారా? ఈ ఫార్ములా మర్చిపోవద్దు!

బ్యాంకు లోన్ తీసుకొని కారు కొంటున్నవారు 20/4/10 ఫార్ములాను తప్పక పాటించాలి. ఈ రూల్ ప్రకారం కార్ ఆన్ రోడ్ ప్రైజ్‌లో 20% డౌన్‌పేమెంట్ చెల్లించాలి. లోన్ గరిష్ఠ టెన్యూర్ 4ఏళ్లకు మించకూడదు. EMI మీ నెలవారీ సంపాదనలో 10శాతానికి ఎక్కువ కాకుండా చూసుకోవాలి. అప్పుడే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావు. బ్యాంకులు 8.70% నుంచి 10% వడ్డీతో కార్ లోన్లు ఇస్తున్నాయి. సిబిల్ స్కోర్‌ను బట్టి వడ్డీ శాతం అంచనా వేస్తారు.
News February 26, 2025
ములుగు జిల్లా కలెక్టర్ సూచన

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. ఈనెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జిల్లాలోని 9 పోలింగ్ కేంద్రాలకు సరిపడా సిబ్బందిని నియమించడంతో పాటు మరో 20 శాతం అదనపు సిబ్బందిని రిజర్వులో ఉంచామన్నారు. జిల్లాలో 628 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారని వివరించారు.
News February 26, 2025
ADB జిల్లాలో 31 ఇంటర్ పరీక్ష కేంద్రాలు: కలెక్టర్

ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు మొత్తం 18,880 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ఎస్ఈకి సూచించారు. నిర్ణీత సమయానికి సకాలంలో ప్రశ్నపత్రాలు కేంద్రాలకు చేర్చాలన్నారు.