News February 23, 2025
హనుమకొండ: రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్ ప్రావీణ్య

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం రద్దు విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు. వచ్చే సోమవారం యథావిధిగా జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Similar News
News February 24, 2025
కృష్ణా: 25న జిల్లా సబ్ జూనియర్ ఫెన్సింగ్ జట్ల ఎంపికలు

వీరులపాడు మండలం పొన్నవరంలోని ఏకత్వా పాఠశాలలో అండర్-14 బాల, బాలికల ఉమ్మడి కృష్ణా జిల్లా ఫెన్సింగ్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఆదివారం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి నాగం సతీష్ బాబు తెలిపారు. ఈ ఎంపికలు ఈ నెల 25న మధ్యాహ్నం 2గంటలకు నిర్వహించనున్నట్లు వివరించారు. జిల్లాలో ఆసక్తి గల క్రీడాకారులు FAI గుర్తింపు కార్డు, ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు.
News February 24, 2025
రిజిస్ట్రేషన్ శాఖలో ఖాళీలు భర్తీ చేస్తాం: మంత్రి అనగాని

రిజిస్ట్రేషన్ల శాఖకు కొత్త భవనాలు నిర్మించి ఇస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఆదివారం గుంటూరులో ఉద్యోగుల సంఘం డైరీను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు రద్దు చేసినందుకు ఉద్యోగులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఖాళీలను సచివాలయ సిబ్బందితో భర్తీ చేయిస్తామని మంత్రి తెలిపారు.
News February 24, 2025
మెదక్: నేడు హెల్ప్ డెస్క్ ద్వారా ప్రజావాణి

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 24 సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి వినతులు హెల్ప్ డెస్క్ ద్వారా స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల విధులు కేటాయించిన వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉండనందున కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు.