News July 9, 2025
హనుమకొండ: వడ్ల బస్తాల లోడ్ లారీ దగ్ధం

వడ్ల బస్తాల లోడ్‌తో ఉన్న లారీ దగ్ధమైన ఘటన హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్ దగ్గర ఈరోజు చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కరీంనగర్ నుంచి హనుమకొండ వైపు వడ్ల బస్తాల లోడ్‌తో వస్తున్న ఓ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమైంది. డ్రైవర్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని బయట పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మంటలు ఎలా వచ్చాయనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News July 9, 2025
గిల్ కెప్టెన్సీకి 10కి 10 మార్కులు: రవిశాస్త్రి

ఎడ్జ్‌బాస్టన్‌లో గిల్.. డాన్ బ్రాడ్‌మన్‌లా బ్యాటింగ్ చేశారని టీమ్ ఇండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి కొనియాడారు. ‘రెండో టెస్టులో గిల్ కెప్టెన్సీకి 10కి 10 మార్కులిస్తాను. విదేశాల్లో ఒక భారత కెప్టెన్ చేసిన అత్యుత్తమ ప్రదర్శన ఇది. ఆకాశ్ లాంటి సీమర్‌ను తీసుకున్న అతని నిర్ణయాన్ని మెచ్చుకోవాలి. అక్కడి పరిస్థితులకు ఆకాశ్ సరైన ఎంపిక. అతను సిరీస్ మొత్తం ENG బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు’ అని తెలిపారు.
News July 9, 2025
డోపింగ్ టెస్టులో పట్టుబడిన భారత స్టార్ రెజ్లర్

భారత టాప్ హెవీవెయిట్ రెజ్లర్ రితికాహుడా డ్రగ్ వాడినట్లు డోపింగ్ టెస్ట్‌లో తేలింది. ఆసియా ఛాంపియన్‌షిప్ ముందు మార్చి 15న చేసిన టెస్టులో.. ఆమె మూత్రంలో నిషేధిత S1 అనబాలిక్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్ గుర్తించారు. దాంతో జాతీయ యాంటీ డోపింగ్ సంస్థ ఏడాది నిషేధం విధించింది. రితికా తాను తప్పుచేయలేదని, విచారణకు సహకరిస్తానన్నారు. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్(2025 Sep)వేళ ఆమెపై భారత్ ఆశలు పెట్టుకుంది.
News July 9, 2025
గోల్డ్‌మన్ శాక్స్ సీనియర్ అడ్వైజర్‌గా రిషి సునాక్

బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ గోల్డ్‌మన్ శాక్స్‌లో చేరినట్లు ఆ సంస్థ ప్రకటించింది. సీనియర్ అడ్వైజర్‌గా క్లయింట్స్‌కు మ్యాక్రోఎకనామిక్, జియో పొలిటికల్ వ్యవహారాల్లో సలహాలిస్తారు. 2001-2004 వరకు రిషి సునాక్ ఇదే సంస్థలో అనలిస్ట్‌గా ఉన్నారు. 2015, 17, 19లో రిచ్‌మండ్&నార్తల్లెర్టన్ MPగా గెలిచారు. బోరిస్ ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా ఉన్న ఆయన.. ప్రధానిగా ఎన్నికై OCT 2022-జులై 2024 వరకు సేవలందించారు.