News February 17, 2025
హనుమకొండ: విద్యార్థులకు మరో అవకాశం

హనుమకొండ జిల్లాలో తేదీ 03-02-2025 నుంచి 16-02-2025 వరకు జరిగిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు వివిధ కారణాల వల్ల హాజరు కానీ విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తేదీ: 18-02-2025 నుంచి 22-02-2025 వరకు మళ్లీ పరీక్ష రాసుకోవడానికి అవకాశం కల్పించిందని జిల్లా విద్యాధికారి ఏ.గోపాల్ తెలిపారు. ఈ పరీక్షలు వడ్డేపల్లిలోని పింగిళి బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నామని తెలిపారు.
Similar News
News November 18, 2025
కామారెడ్డి జిల్లాలో దారుణం

సభ్య సమాజం తలదించుకునేలా కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బీబీపేట్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తన పదమూడేళ్ల కూతురిని లైంగికంగా వేధించాడు. నిత్యం వేధింపులు భరించలేక బాధితురాలు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు తండ్రిపై సోమవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రభాకర్ ఈరోజు తెలిపారు.

వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు

YCP అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని తాడిపత్రి రూరల్ పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం ప్రత్యేక పోలీసు బృందం ఆయన నివాసానికి చేరుకుని అరెస్ట్ చేసింది. పరకామణి కేసు, సీఐ సతీశ్ మృతిపై డిబేట్‌లో మాట్లాడినందుకు ఈ అరెస్ట్ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనను రోడ్డు మార్గాన తాడిపత్రికి తరలిస్తున్నారు. సీఐ మృతిపై తాడిపత్రి రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.