News December 18, 2025
హనుమకొండ: 20న జాబ్ మేళా

ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగ యువత ఉపాధి కల్పనకు ఈ నెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి అధికారి మల్లయ్య తెలిపారు. టెలికాలర్స్, సేల్స్, రిటైల్, మార్కెటింగ్ తదితర విభాగాల్లో సుమారు 70 ప్రైవేటు ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్నారు.18 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్న వారు ఇంటర్, డిగ్రీ, ఐటీఐ అర్హత ఉన్న అభ్యర్థులు అర్హులన్నారు. ధ్రువపత్రాలతో తమ కార్యాలయంలో హాజరవ్వాలని సూచించారు.
Similar News
News December 18, 2025
KNR: ముగిసిన ‘గమ్మత్తు’ పంచాయతీ ఎన్నికలు

ఉమ్మడి KNR వ్యాప్తంగా 3 దశల పంచాయతీ ఎన్నికలు నిన్నటితో విజయవంతంగా ముగిశాయి. చిత్రవిచిత్రాలతో గమ్మత్తుగా సాగిన ఈ పంచాయతీ ఎన్నికలకు నిన్నటితో ఎండ్ కార్డ్ పడింది. నామినేషన్లు, అభ్యర్థుల ప్రకటనలు, ప్రచారాలతో గ్రామాలు గత నెలరోజులుగా జాతరను తలపించాయి. కొందరు అభ్యర్థులు ఓటమిని అంగీకరించి హుందాగా పరిషత్ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతుంటే.. గెలిచినవారిని గ్రామాల్లోని ప్రధాన సమస్యలు ఆహ్వానిస్తున్నాయి.
News December 18, 2025
అత్యధికం ఎల్లారెడ్డి.. అత్యల్పం రామారెడ్డి

కామారెడ్డి జిల్లాలో మూడు విడతల్లో ఈ నెల 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 5,97,512 ఓటర్లకు గాను 4,97,861 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా రెండో విడతలో 86.08% పోలింగ్ జరగగా, అత్యల్పంగా మొదటి విడతలో 79.40% పోలైంది. అత్యధికంగా ఎల్లారెడ్డి మండలంలో ఓట్లు పోలవ్వగా, అత్యల్పంగా రామారెడ్డిలో పోలయ్యాయి.
News December 18, 2025
టైగర్ జోన్‌లో ఆవాసాల కొరత.. జనావాసాల్లోకి పులులు

టైగర్ జోన్ పరిధిని దాటి పులులు పెద్దపల్లి జిల్లాలో గ్రామాల శివార్లలోకి రావడం స్థానిక ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. చెట్ల నరికివేత, గనులు, రోడ్ల నిర్మాణంతో పులుల సహజ ఆవాసాలు తగ్గిపోవడం, అడవుల్లో ఆహారం, నీటి కొరత పెరగడం జనావాసాల్లో పులుల సంచారానికి ప్రధాన కారణాలుగా అధికారులు భావిస్తున్నారు. అక్రమ వేట, స్మగ్లింగ్ ముప్పూ పెరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయి. పులుల సంచారం పెరగడంతో అటవీ శాఖ అప్రమత్తమైంది.


