News March 4, 2025
హనుమకొండ: DANGER ప్లేస్.. మరో వ్యక్తి మృతి

హసన్‌పర్తి మండలం కోమటిపల్లిలోని నిరూప్ నగర్ తండా సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఉనికిచర్ల ప్రధాన రహదారిపై ఈరోజు యాక్సిడెంట్ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన కడుగుల రవి(60) బైక్‌పై హనుమకొండ వెళ్తుండగా ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి కింద పడ్డాడు. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. కాగా గత ఆరు నెలల్లోనే సేమ్ ప్లేస్‌లో ఐదుగురు చనిపోవడం గమనార్హం.
Similar News
News March 4, 2025
భూపాలపల్లి: ఆ కుటుంబాల్లో విషాదం

నిన్న రాత్రి రాంపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం <<15642532>>3కుటుంబాల్లో<<>> విషాదం నింపింది. మరణించిన పంబాపూర్ వాసి సతీశ్ భార్యకు ఈనెల 6న డెలివరీ డేట్ ఉంది.ఏడాది వయసు గల పాప కూడా ఉంది. ఇక మరో ఇద్దరు మృతులు మహాముత్తారం మండలం మీనాజీపేట వాసులు రవీందర్ రెడ్డి(42),నరసింహారెడ్డి(33)వరుసకు బంధువులు.నర్సింహకు పదేళ్లలోపు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వరుసగా మృతదేహాలు అంత్యక్రియలకు వెళ్లడం గ్రామస్థులందరినీ కంటతడి పెట్టించింది.
News March 4, 2025
WGL: పెరిగిన మొక్కజొన్న, తగ్గిన పల్లికాయ ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈరోజు చిరుధాన్యాలు తరలివచ్చాయి. ఈ క్రమంలో మొక్కజొన్న, పల్లికాయ ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు(బిల్టి) క్వింటాకు సోమవారం రూ.2,355 పలకగా.. నేడు రూ.2,360కి పెరిగింది. అలాగే పచ్చి పల్లికాయ క్వింటాకి నిన్న రూ.5,500 ధర రాగా.. నేడు రూ.5,600 పలికింది. సూక పల్లికాయకి నిన్న రూ.7,500 ధర, నేడు రూ.6900కి పడిపోయింది.
News March 4, 2025
వరంగల్: స్వల్పంగా పెరిగిన పత్తిధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,880 పలకగా.. ఈరోజు రూ.40 పెరిగింది. దీంతో రూ.6,920 జెండా పాట పలికినట్లు వ్యాపారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి మార్కెట్ ధరలలో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.