News January 22, 2026

హనుమాన్‌పేట్‌లో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక

image

విజయవాడ హనుమాన్‌పేటలోని ఏపీలోని అన్ని జిల్లాల ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుల రాష్ట్ర కార్యవర్గ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి, విద్యార్థుల పౌరహక్కుల పరిరక్షణకు ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ పనిచేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోగా, రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాసులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Similar News

News March 30, 2026

మెదక్: బెట్టింగ్‌లకు పాల్పడినా, ప్రోత్సహించినా చర్యలు: ఎస్పీ హెచ్చరిక

image

జిల్లాలో ఎవరైనా క్రికెట్‌ లేదా ఇతర బెట్టింగ్‌లకు పాల్పడినా, ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డివి. శ్రీనివాస రావు హెచ్చరించారు. ఇటీవల కాలంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువత క్రికెట్‌ బెట్టింగ్ మోజులో పడి తమ భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెడుతున్నారని తెలిపారు. బెట్టింగ్‌లపై సమాచారం ఉన్నవారు వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100, కంట్రోల్ రూమ్ 8712657888కు సమాచారం ఇవ్వాలన్నారు.

News March 30, 2026

పెట్రోల్ బంకుల ద్వారా కిరోసిన్ పంపిణీ

image

యుద్ధం నేపథ్యంలో దేశంలో కిరోసిన్ వినియోగాన్ని అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. పెట్రోల్ బంకుల్లో తాత్కాలికంగా 60రోజుల పాటు దీన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాలో 2బంకులు 5వేల లీటర్ల కిరోసిన్‌ను నిల్వ చేసుకునేలా నిబంధనలు సడలించింది. అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ(PDS) ద్వారా కిరోసిన్ సప్లై చేయనుంది. PNG కోసం శనివారం 6వేల మంది స్వచ్ఛందంగా LPG కనెక్షన్లు వదులుకున్నట్లు కేంద్రం తెలిపింది.

News March 30, 2026

గోదావరిలో దూకి B.tech చదివిన యువకుడి ఆత్మహత్య

image

గోదావరిలోకి దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజమండ్రిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. రావులపాలానికి చెందిన జాగ్రత్ యువరాజు( 24) బీటెక్ చదివాడు. ఇటీవల అతడు ఖాళీగా ఉంటున్నాడని తండ్రి నూకరాజు మందలించడంతో ఈనెల 27న ఇంటి నుంచి అలిగి వెళ్లిపోయాడు. కాగా, ఆదివారం అతడు స్థానిక గోదావరి గట్టు ధోబి ఘాట్ వద్ద శివమై తేలాడు. టూ టౌన్ ఎస్ఐ అశ్వక్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.