News January 22, 2026
హనుమాన్‌పేట్‌లో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక

విజయవాడ హనుమాన్‌పేటలోని ఏపీలోని అన్ని జిల్లాల ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుల రాష్ట్ర కార్యవర్గ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి, విద్యార్థుల పౌరహక్కుల పరిరక్షణకు ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ పనిచేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోగా, రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాసులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Similar News
News March 30, 2026
ప.గో జిల్లాలో నేడు ఇళ్ల పంపిణీ

ప.గో జిల్లాలో నిర్మాణం పూర్తయిన గృహాలను నేడు లబ్ధిదారులకు పండుగ వాతావరణంలో అందజేయనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనే ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆమె అన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడంలో ప్రభుత్వం చేపట్టిన ఈ గృహ నిర్మాణ పథకం ఇప్పుడు కీలక దశకు చేరుకుందని కలెక్టర్ పేర్కొన్నారు.
News March 30, 2026
కర్నూలు జిల్లాలో కరవు మండలాలు ఇవే

2024-25 ఆర్థిక సంవత్సరానికి కర్నూలు(D)లో 9 మండలాలను కరవు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆస్పరి, కల్లూరు, కర్నూలు రూరల్, అర్బన్, మద్దికేర, ఓర్వకల్లు, గూడూరు, కోడుమూరు, వెల్దుర్తి మండలాలు ఆ జాబితాలో ఉన్నాయి. అయితే మంత్రాలయం నియోజకవర్గంలో ఒక్క మండలం కూడా లేకపోవడం, ఆలూరు నియోజకవర్గంలో 6 మండలాల్లో ఆస్పరి మాత్రమే ఉండటం, ఆదోని నియోజకవర్గంలో ఒక్క మండలాన్నీ చేర్చకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
News March 30, 2026
చందర్లపాడులో హత్య.. అప్‌డేట్ ఇదే

చందర్లపాడు మండలం చింతలపాడులో ఆదివారం వెంకటపతి (80) <<19509397>>హత్యకు <<>>గురైన విషయం తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు కొడవలితో ముక్కు, గొంతు, చేతులపై విచక్షణారహితంగా నరికి చంపినట్లుగా ఉందని స్థానికులు చెబుతున్నారు. పాత కక్షలా లేక మద్యం మత్తులో జరిగిన ఘాతుకమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.


